भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 610, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 610

590 చక్రదత్త—౬౫. రసాయనాధికారము.

పాకముకొఱకు త్రిఫలముల రెండుభాగములలో ఒకశరావము చెప్పఁబడినది. ప్రతిపలమునకు నీరుసమానము. రెండుశరావములకంటె నెక్కువయుండిన నాలవభాగమును నేర్పుగా గ్రహింపవలయును. అయస్సు పాకము నిమిత్తమగుట వలన నయ్యది యన్నిటికంటెను ప్రధానము. పాకార్థమైనలోహసారమునకు అయిదు మొదలుకొని 13 పలములవఱకు పాలుగల రెండు మూకుళ్లుపోయవలయును. ఒక్కొక్కపాదమునకు నిట్లధికమగును. అయిదుపలములది మాత్ర. అయ్యది లేనిచో తదనుసారముగా గ్రహింపవలయును. కరక తాడి యుసిరిక త్రికటుక చిత్రమూలము తెల్లలొద్దుగ వాయువిడంగములు వీటిని చూర్ణము చేసి మోదుగ మాడను పొడిచేసి జాజికాయ జాపత్రి యలకులు లవంగము తెల్లజీలకఱ్ఱ నల్లజీలకఱ్ఱ వీటిని చూర్ణము చేసి లోహముతో సమముగా స్వీకరింపవలయును. కరకతాడియుసిరిక శొంతి మిరియములు పిప్పళ్లు వీటిఁ దప్పక తీసికొనవలయును. తక్కినవానిని ప్రకృత్యనుసారముగా గ్రహింపవలయును. జాజికాయమొదలులవంగము వఱకున్న యౌషధములు ఆయాదోషమును పోగొట్టి ప్రాప్త్యానుసారముగా ఫలమునిచ్చును. జాజికాయ తెల్లలొద్దుగ లోహదోషములను పోగొట్టును. ప్రకృత్యనుసారముగా రెండుమూడు నాలుగు రెట్లు కూడ నేతిని గ్రహింప వచ్చును. ఔషధ మెక్కువై చూర్ణము తక్కువైన లోహమును భస్మించేయ వలయును. ఇట్లు ధాత్వను సారముగా చెప్పనిస్థలముల నౌషధుల నూహించుకొననది.

కాంతాదిలోహమారణవిధులు.

శ్లో. కాంతాదిలౌహమారణవిధానసర్వస్వముచ్యతేతావత్,
యస్య కృతే తల్లోహం పక్తవ్యం తస్య శుభే దివసే. 52.
సమ్యదంగారక వాలితసతభూభాగే శివం సముభ్యర్చ్య,
వైదికవిధినా వహ్నిం నిధాయ హృత్వా౭౭హుతీ స్తత్ర. 53.
ధర్మాత్సిధ్యతి సర్వం శ్రేయ స్తద్ధర్మసిద్ధయేకిమపి,
శక్త్యనురూపం దద్యా ద్ద్విజాయ సంతోషిణేగుణినే. 54.
సంతోష్య కర్మకారం ప్రసాదపూగాది దానసంమానైః,
అథా తదశ్మసారం నిర్మల మేకాంతతః కుర్యాత్. 55.
తదనుకుఠారచ్ఛిన్న త్రిఫలాగిరికర్ణికాస్థిసంహారైః,
కరికర్ణచ్ఛదమూలకశతావరీకేశరాజాఖ్యైః. 56.
శాలించ మూలక కాశీ మూలాప్రావృజ్జ భృంగరాజై శ్చ
లిప్త్వా దగ్ధవ్యం తత్ దుష్టక్రియలోహకారేణ. 57.
చిరజలభావితనిర్మల శాలాంగారేణ పరిత ఆచ్ఛాద్య,
కుశలాధ్మాపిత భస్త్రా నవరత

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 610, कुल 674 में से · BharatKosha