चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 70, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 49
అందులోఁ జేర్చవలయును. ఈ తైలము దాహమును, చలిజ్వరమును పోఁగొట్టును. ఇయ్యదియే లాక్షాదితైలము. యవలచూర్ణము అరకుడపమును, మంజిష్ఠ అరపలమును నూనె ఒక ప్రస్థమును, గంజి నూరురెట్లును చేర్చి ఈరీతిగా సిద్ధము చేయఁబడిన, తైలము అత్యంతము వేగము కలిగిన జ్వరమును, విదాహమును అణచి వైచును. అవయవము లదరుటనుకూడ మాన్పును. సర్జరసమునందును, గంజియందును కలుపఁబడి సిద్ధముచేయఁబడిన తైలమును చల్లనినీటితో చేర్చి చిలికి పూతపూసినట్లయిన జ్వరము, విదాహము, వాతరక్తప్రకోపమువలన గలిగిన దాహము వీనిని పోఁగొట్టును.
చందనాదితైలమును, అగుర్వాదితైలమును చరకుఁడు చెప్పినరీతిగా— నారాయణతైలమును, ఈ మూడుతైలములును పురాణజ్వరములను హరించును. నేతిని పీల్చుట చేతను, త్రాగుటవలనను, రుద్దికొనుటవలనను, అభిఘాతజ్వరము దూరముగా తొలఁగిపోవును. గాయము తగిలినవారలకుగాని, వ్రణములు కలుగుటవలనగాని, జ్వరమువచ్చినయెడల గాయములకును వ్రణమునకును చికిత్సచేయుటచేత జ్వరము తొలఁగిపోవఁగలదు.
ఔషధుల వాసనవలనఁగాని విషమువలన గాని కలిగిన జ్వరములను విషభక్షణము నశించుట కిచ్చెడు కషాయముచేతగాని మఱియు నన్నివిధములగు గంధములతోఁ గలిసిన కషాయములచేతఁగాని వైద్యుఁడగువాఁడు తొలంగునట్లు చేయవలయును. అభిచారము, అనఁగా చిల్లంగి (దీనిని ప్రయోగ మని చాతపాడి యని వాడుచుందురు.) శాపమిచ్చుటవలనఁ బుట్టెడు జ్వరములను హోమము మున్నగు వానివలనఁ జయింపఁదగును.
ఉత్పాతములచేతను గ్రహపీడలచేతను పుట్టినజ్వరములను, దానము, పుణ్యాహవాచనము, అతిథిపూజ, బ్రాహ్మణసంతర్పణము మొదలగువానివలన పోఁగొట్టుకొనవచ్చును. కోపాధిక్యమువలనఁ బుట్టుచుండెడి జ్వరములకు పిత్తజ్వరములను పోఁగొట్టు క్రియలనే చేయవలయును.
కామ్యములు, వాంఛితలాభము, ప్రయోజనసిద్ధి, ఊరడింపుమాటలు, వాయువునుతగ్గించుట, సంతోషము, దీనిచేత కామక్రోధభయజనితములగు జ్వరములు నశించును. కామమువలన పుట్టెడిజ్వరమును, క్రోధమువలన కలిగెడి జ్వరములును ఈ రెండువిధములుగాక భయదుఃఖాదులవలన పుట్టిన జ్వరములు హర్షణక్రియలచేత శాంతినొందగలుగును.
మంత్రశాస్త్రము (అనఁగా భూతవైద్యము)తోఁ జెప్పఁబడియున్న, గ్రహబంధములు, ఉచ్చాటనలు, ఆవేశనములు, తాడనములు, మారణములు మున్నగునీచికి
7