चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 75, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 55
అగరుశొంతి, దేవదారు, అతివస వీనినన్నిటిని సమానభాగములుగా తీసికొనవలయును. పిదప వీనిని బాగా చూర్ణముచేసి కొడిసెపట్టయొక్క చూర్ణముకూడ నిందుగలిపి కలికడుగునీళ్లలో వేసికొని త్రాగినయెడల గాని తేనెలోకలిపికొని నాకినయెడల గాని, తలనోప్పులనుపోఁగొట్టును. అన్నమును పచనముజేయును, దప్పిని అరుచిన పోఁగొట్టును. జ్వరాతిసారములను గూడ నశింపఁజేయును.
దశమూలముల కషాయముతో కలిసి ఒకపలమెత్తు శొంతిరసమును త్రాగవలయును. ఇట్లుచేసిన జ్వరమువచ్చినప్పుడును, అతిసారము గలిగినప్పుడును, శోఫయందును, గ్రహణీదోషములయందును బాధను పోఁగొట్టి సుఖమును ఈయఁగలదు. వాయువిడంగము,అతివస, తుంగముస్తలు, దేవదారు, అగరుశొంతి, కొడిసెపాలవిత్తులు వీటితో చేసిన కషాయముఁ ద్రాగిన అతిసారములుగూడ నశించిపోవును.
నేలవేము, తుంగముస్తలు, తిప్పతీగె,శొంతి, రక్తచందనము, కురువేరు, కొడిసెవిత్తులు, చందనము వీటికషాయము శోఫలుగల అతిసారములగూడ నణంచును. మఱియును ముఖ్యముగా జ్వరములను పోఁగొట్టును. వాయువిడంగములు, తుంగముస్తలు, తిప్పతీగె, కురువేరు, భద్రముస్తలు, రక్తచందనము, ధనియములు వీటితోఁ జేయఁబడిన కషాయము శోఫలతోగూడిన యతిసారములను, దప్పి,గొంతెండిపోవుట, జ్వరము మున్నగువానినిగూడ పోఁగొట్టును.
ఇట్లు చక్రదత్తసంహితయందు జ్వరాతిసారప్రకరణము ముగిసెను.