चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 84, कुल 674 में से
संदर्भ में पढ़ें64 చక్రదత్త—3. అతిసారాధికారము.
నను కొడిసెపట్టతో చేసిన కషాయమునందు తేనెను కలిపికొని త్రాగినను ఆమాతిసారములు నశించి పోఁగలవు. మట్టిచిగుళ్ళను బియ్యపుకడుగుతోఁ గూడ చేర్చి నూరికొని తాగినయెడల నతిసారముల పీడ లేకుండ తొలగిపోవును.
ఊడుగ వేళ్ళను బియ్యపుకడుగుతో నూరి కల్కముచేసి అర్ధకర్షప్రమాణము సేవించినయెడల అన్నివిధములగు నతిసారములును, గ్రహణులును, భయంకరము లగు నితరరోగములును నశించిపోఁగలవు. బుబ్భూలపుచెట్టుయొక్క లేతచిగుళ్లను (అనఁగా నెలిగుమ్ము చిగుళ్లు) కల్కముచేపికొని త్రాగినయెడలగాని కొడిసెపట్టుగట్టిగా కషాయమునుగా గాచికొని చక్కగా చల్లార్చికొని అతివసచూర్ణమునుగా చేసికొని పుచ్చుకొనినయెడలగాని అన్ని విధములగు నతిసారములును నశించిపోఁగలవు. కొందఱు కషాయమునందు ఎనిమిదవపాలు అతివసచూర్ణమును వేయవలయునని చెప్పెదరు. మఱియును లేహముకంటె అతివసచూర్ణము నాల్గవపాలు వేయవలయునని నేను యభిప్రాయము నొందుచున్నాను.
-• అంకోలవటకము: విడంగాదిక్వాథము. •-
శ్లో. నదార్వ్యం కోట పాఠానాం మూలం త్వక్కుటజస్య చ. 56. శాల్మలీశాలసిర్యాస ధాతకీలోధ్రదాడిమం, పిష్ట్యైత్ సమైతాన్ కృత్వా వటకాం స్తండులాంబునా. 57. తేనైవ మధుసంయుక్తా నేకైకాం ప్రాత రుత్థితః, పిబే దత్యయ మాపన్నో విడ్విసగ్గేణ మానవః. 58. అంకోటవటకో నామ్నా సర్వాతీసారనాశనః, పయ స్యర్ధోదకే భాగే హ్రీబేరోత్పలనాగరైః. 59. పేయా రక్తాతిసారఘ్నీ పృశ్నిపర్ణ్యా చ సాధితా, రసాంజనః సాతివిషం కుటజస్య ఫలం త్వచం. 60. ధాతకీ శృంగబేరం చ ప్రపిబే త్తండులాంబునా, క్షౌద్రేణ యుక్తం నుదతి రక్తాతిసార ముల్బణం. 61. మందం దీపయతే చాగ్నిం శూలం చాపి నివర్తయేత్, విడంగాతివిషాముస్తం దారుపాఠాకలింగకం. 62. మరిచేన సమాయుక్తం శోధాతీసారనాశనం.
మానిపసపు, అంకోలపుచెట్టు (ఊడుగు) వేళ్లు, అగరుశొంఠి, కొడిసెచెక్క, బూరుగుబంక, మద్దిబంక, ఆరెచెక్క, లొద్దుగచెక్క, దానిమ్మ బెగడు, వీటిని అన్నింటిని సమానముగా ఒక్కొక్క అక్షము చొప్పున తీసికొని కడుగునీళ్లతో నూరి కల్కమును చేసికొని తేనెను వేసికొని మాత్రకట్టి యిఁడవవలయును. మఱల ప్రాతఃకాలముననే లేచి అతిసారరోగముగల రోగి దానిని పుచ్చుకొనవలయును. ఇయ్య