मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 105, कुल 167 में से
संदर्भ में पढ़ें98 ముకుందమాల మరల పుట్టవలసిన అక్కర యుండదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాదపరి హార్యేఽర్థే న త్వం శోచితు మర్హసి. -- గీత. 2.27 శ్లోకములందువలె జనన మరణములు లేకుండ పోవును. 18 హే మర్త్యాః పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపత స్సంసారార్ణవ మాపదూర్మిబహుళం సమ్యక్ప్రవిశ్య స్థితాః, నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారాయణాయే త్యముం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః. ఆపత్ = ఇడుమ లనెడు, ఊర్మి = అలలచేత, బహుళం = గొప్పదైన, సంసార+అర్ణవం = సంసారమనెడు సముద్రమును, సమ్యక్ = లెస్సగా, ప్రవిశ్య = ప్రవేశించి, స్థితాః = నిలుకడగా నుండునట్టి, హే మర్త్యాః = ఓ మనుష్యు లారా, వః = మీకు, పరమం హితం = మిక్కిలి మేలుగలిగెడు సంగతిని, సంక్షేపతః = సంగ్రహముగా, వక్ష్యామి = చెప్పబోవుచున్నాను, శృణుత = వినుడు, నానాజ్ఞానం = సకల విధములైన యజ్ఞానములను, అపాస్య = విడిచిపెట్టి, సప్ర ణవం = ఓంకారరూప ముఖ్యప్రణవముతో గాని, అంకారరూప గౌణప్రణవముతో గాని కూడినదియు, ప్రణామ సహితం = నమస్కారముతో గూడినదియు నగు, నమో నారాయణాయ+ ఇతి = నమో నారాయణాయ అను, అముం మంత్రం = ఈ మంత్రమును, చేతసి = మనసునందు, ముహుః = పలుమారు, ప్రావర్తయధ్వం = జపము చేయుడీ! ఆపద లనెడి యలలచే బహుళమగు సంసారసముద్రమును పొంది యుండు మనుజులారా! మీకు హితమొక్కటి సంగ్రహముగా చెప్పెదను,