भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 107, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 107

100 ముకుందమాల అజ్ఞానులు అనేక సాధనము లందురు. అది విని సంశయపడరాదు. శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా, సమాధా వచలా బుద్ధి స్తదా యోగ మవాప్స్యసి. -- గీత. 2.53 శ్లోకములోవలె సందేహరహితుడు కావలయును. కొందరు పుణ్యపాపములు లేవ నియు, ప్రత్యక్షమే ప్రమాణ మనియు చెప్పుదురు. ఆ మాటలు నమ్మరాదు. వైదికాభాసమతమును బోధించువారి మాటలు వినరాదు. ప్రామాణిక మతమునే గమనింపవలయును. అజ్ఞాన కల్పితముగ చెప్పు వారిమాటలు వినరాదు. వారి మాటలకు ఆధారముండదు. ముగింపు ఉండదు. కాన నానావిధాజ్ఞానమును వదలి ఒక్కటి పట్టుకొనవలయును. జనులు : ఆ మందును చక్కెర, నేయి, తేనె మొదలగు వానిలో దేనితో కలిపి పుచ్చుకొనవలయును? లేక ఊరకయే పుచ్చు కొనవచ్చునా? (జరామరణ వ్యాధి పోవలయునన్న నేమి చేయవలయునని యర్థము.) (పూర్వశ్లోకమున కృష్ణుడను నౌషధము చెప్పబడెను. ఈ శ్లోకమున ఆ మందును దేనితో కలిపి తీసికొనవలయునో అనగా భగవంతు నెటు లాశ్రయించవలయునో ఆ సంగతి ననగా అనుపానమును చెప్పుచున్నాడు.) కుల : నమో నారాయణాయ అను మంత్రమును ప్రణవము తోడను (ఓంకారము), ప్రణామము తోడను, భక్తి తోడను, అడు గడుగునకు జపించుచుండుడు. ఔషధమును తేనెతో గలిపి తీసికొనునట్లు శ్రీకృష్ణు డను నౌషధమును ప్రణవముతో గూడిన నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్రమ నెడు అనుపానముతో తీసికొనుడు. ముముక్షుప్పడి 17వాక్యమున భక్తితో చేసినను, లేకున్నను భగవన్నా మము కాపాడునని చెప్పబడియుండగా నిచట భక్తి చేయవలయునని