भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 108, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 108

ముకుందమాల 101 చెప్పటేల యనగా దివ్యమైన యౌషధము పథ్యము లేకున్నను వ్యాధిని కుదుర్చును. పథ్యముగ నుండినచో మఱియును విశేషము. ఈ మంత్రము ఈ రీతిగనే భక్తితోకూడెనేని విశేషమగును. నమో నారాయణాయ యను మంత్రమును ప్రణవముతో చేర్చి చెప్పవలెను. అట్లుకాకపోయిన అష్టాక్షరి యగుటకు బదులు సప్తాక్షరియే గదా అగును? 19 పృథ్వీ రేణు రణుః పయాంసి కణికాః ఫల్గు స్ఫులింగో౨లఘుః, తేజో నిశ్శ్వసనం మరు త్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః, క్షుద్రా రుద్రపితామహప్రభృతయః కీటాస్సమస్తా స్సురాః దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః. యత్ర=ఏ నీమహిమ, దృష్టే సతి=చూడబడిన దగుచుండగా, పృథ్వీ= భూమి, అణుః=సూక్ష్మమయిన, రేణుః=ధూళియో, పయాంసి=సముద్రజల ములు, కణికాః=నీటి తుంపరలో, అలఘుః=గొప్పదైన, తేజః=సూర్యచంద్రా గ్నుల వెలుగు, ఫల్గుః=చిన్నదగు, స్ఫులింగః=మిణుగురో, మరుత్=గాలి, తనుతరం=మిక్కిలిసన్నదైన, నిశ్శ్వసనం=నిట్టూర్పో, నభః=ఆకాశము, సుసూక్ష్మం=మిక్కిలిసన్నని, రంధ్రం=బెజ్జమో, రుద్ర=ఈశ్వరుడు, పితా మహ=బ్రహ్మదేవుడు, ప్రభృతయః=మొదలుగా గలవారైన, సమస్తాః సురాః= దేవత లందఱును, క్షుద్రాః=చిన్న, కీటాః=పురుగులో, సః=అటు వంటి, తావకః=నీదైనట్టి, అవధూతావధిః=అంతములేనట్టి, భూమా=మహిమ, విజయతే=అంతట వ్యాపించి సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది. ఏ నీ మహిమ పరికించినప్పుడు భూమి చిన్న దుమ్ముగాను, ఉదక ములు చిన్న తుంపరలుగాను, అగ్ని స్వల్పమైన మిణుగురులుగాను, వాయువు సన్నని ఊపిరిగాను, ఆకాశము చిన్న ద్వారముగాను, బ్రహ్మరుద్రాదులగు సమస్తదేవతలు చిన్న పురుగులుగాను అగుదురో అట్టి నీ మహిమ ఎల్లలేక