मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 109, कुल 167 में से
संदर्भ में पढ़ें102 ముకుందమాల వెలుగుచున్నది. (కులశేఖరులు భగవత్పరత్వమును విశేషముగ కొనియాడి ప్రజలకు బోధించగా భగవంతుడు కులశేఖరు నీ రీతి నడిగెను). స్వామి : నన్ను ప్రసూతి మరణము లనెడు వ్యాధికి ఔషధమని ప్రజ లకు బోధించి విశేషముగ గౌరవించితివి. బ్రహ్మదేవుడు ఘనుడై యుండలేదా? పంచభూతము లుండలేదా? న న్నింతగ హెచ్చుగ చెప్పనేల? కులశేఖరులు : స్వామీ! నాకు మిక్కిలి పొగడి చెప్పుటకు చేత కాలేదు. నన్ను మీరు మోసపుచ్చ జూచుచున్నారు. కాని నేను బాగుగ గమనించి యున్నాను. స్వామి : భూమి గొప్పదై యుండలేదా? కుల : స్వామీ! నీ గౌరవము తెలియకమునుపు భూమియొక గొప్పదిగా భావింపబడును. కాని నీ మహిమము తెలిసిన పిమ్ముట కూడ అది గౌరవమైనదని తోచునా? అది చిన్న అణువుగ తోచుచున్నది. సముద్ర జలముల నన్ని టిని చేర్చి చూచినను చిన్న బిందువులుగ తోచుచున్నవి. తేజోరూపుడైన అగ్ని చిన్న నిప్పురవ్వగ తోచుచున్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవ ద్దృఢమ్, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్. -- గీత. 6.34 అని గాలి నిలువదని చెప్పబడెను. అట్టిగాలి నీ ముక్కుశ్వాసగ తోచు చున్నది. అంతట నిండియుండు ఆకాశము చిన్న ద్వారముగ తోచుచున్నది. రుద్ర పితామహ ప్రభృతులు క్రిమికీటాదులవలె తోచుచున్నారు. నీ మహిమము అట్లు ప్రకాశించుచున్నది. స్వామి : నా గౌరవము పాటించి యిట్లంటివి. రేపు నాకంటె హెచ్చైన మఱియొకనిని జూచిన నన్నును హీనముగ చూతువేమో!