मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 112, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 105 కంసాంతక=ఓ కంసుని సంహరించిన కృష్ణమూర్తీ, హే గజేంద్రకరుణా పారీణ=గజేంద్రునియొక్క దుఃఖమును పోగొట్టి దరిజేర్చిన వాడా, హే మాధవ=ఓ లక్ష్మీవల్లభుడా, హే రామానుజ=ఓ బలరాముని తమ్ముడా, హే జగత్త్ర్యయగురో=ఓ ముల్లోకములనేలువాడా, హే పుండరీకాక్ష=ఓ తెల్లదా మరలవంటి నేత్రములు గలవాడా, హే గోపీ జననాథ=ఓ గోపస్త్రీప్రియుడా, మాం=నన్ను (త్వం=నీవు), పాలయ=కాపాడుము, త్వాం వినా=నిన్ను దప్ప, పరం=ఇంకొకనిని (అహం=నేను), న జానామి=ఎఱుగను. ఓ గోపాలక! ఓ కృపాజలనిధీ! ఓ సింధుకన్యాపతీ! ఓ కంసాంతకా! ఓ గజేంద్రవరదా! ఓ మాధవా! ఓ రామానుజా! ఓ జగత్త్ర్యయగురూ! ఓ పుండరీకాక్షా! ఓ గోపీజననాథా! నన్ను గాపాడుము. నిన్ను దప్ప నితరము నెఱుంగను. (ఇది నిత్య మనుసంధానము చేయదగిన శ్లోకము.) స్వామి : అంజలిబద్ధుడవై శిరము వంచి రోమాంచముతోడను, దగ్గుతికగల కంఠము తోడను, ఆనందబాష్పముల తోడను, నా పాదధ్యానము సేయుచు కాలము గడు పవలయు నంటివి. వారు వారు వచ్చి తమ మనసు నర్పించి నన్ను వరము లడుగుచుండుట, నే నా మనసు నంగీకరించివారి వారి మనోరథము లీడేర్చుచుండుట యనునదియేనా నా కార్యము? కులశేఖరులు : స్వామీ! నీవు గోపాలకుడవు గదా! గోశబ్దముచేత చెప్ప బడు జీవాత్మలకు అనగా బ్రహ్మమొదలు చీమవఱకు గల సకలప్రాణుల కెల్ల పాలకుడవు గదా! ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవ చ, క్షర స్సర్వాణి భూతాని కూటస్థో౨క్షర ఉచ్యతే. ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః, యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.