भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 115, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 115

108 ముకుందమాల స్వామి : నే నచ్చట నుండిన వేళ ఆదిశేషుడు సహాయుడై యున్నాడు. ఈ లోకమునకు వచ్చుటచేత ఆ యాదిశేషుడు లేడు గదా! ఎట్లు సహాయసంపన్నుడ నగుదును? కుల : స్వామి! నీవు నీ పేరును మార్చితివి. అందుచేత నీ శయ్యయు తన పేరును మార్చుకొనెను. నీవు కృష్ణుడవు. అతడు రాముడు. అందుచేత నీవు రామానుజుడవు. సహా యసంపన్నుడవే. స్వామి : అటులైన నీకేమి కావలయును? స్వామి : జ్ఞాన భక్తి వైరాగ్యములు కావలయును. స్వామి : ఆచార్యు నాశ్రయింపుము. కుల : స్వామి! నీవు ఆచార్యుడవు కావా? కాదని చెప్పిన యెడల ఇతరాచార్యుల నాశ్రయించెదను. స్వామి : నేను గురువు నగుదునా? కుల : స్వామి! నీవు జగత్త్రయగురుడవు కదా! బ్రహ్మదేవుని నాభికమలమునందు గూర్చుండ బెట్టుకొని వేదముల నుప దేశించలేదా? బదరికాశ్రమమున నరనారాయణరూపుడవై నారాయణాష్టాక్షరీమంత్రము నుపదేశించ లేదా? స్వామి : మిగుల స్తుతించుచున్నావు. ఏమి కోరెదవు? కుల : ఓ పుండరీకాక్షా! నీ విశాలనేత్రములతో జూచిన చాలును. స్వామి : జ్ఞానభక్త్యాదు లుండినగదా రక్షింప నగును? కుల : స్వామి! నీవు గోపీజననాథుడవుగదా! గోపికలకు జ్ఞాన భక్త్యాదులుండెనా? వారు సల్పిన కామభక్తిని గూడ సమ్మ తించితివి కదా! కనుక నన్ను కాపాడుటకు సంశయ మేల?