भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 121, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 121

114 ముకుందమాల లను, ఇంద్రియములను భగవద్విషయమున సంబంధపరచవలెనని తెల్పుటకు కులశేఖరులు ‘జిహ్వే కీర్తయ కేశ’వమ్మను శ్లోకమును జెప్పిరి. ఇతరుల దయ సంపాదింపగోరువాడు వారిని సత్కరింపకపోయినను ' వారితో మంచిమాట లాడిన చాలును. అందుచే వారికి ప్రీతి కలుగును. ఇట్లగుటచే వాక్కు ముఖ్యమయినదిగ ఉన్నది. ఈ కారణము చేతనే కులశేఖ రులు ఈ శ్లోకమున జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం=ఓ నాలుకా, శ్రీకృష్ణమంత్రమును సదా జపింపుము, జపింపుము అని అత్యాదరముతో మరల మరల బోధించిరి. నాలుకకు ప్రయోజనము ప్రియవాక్యములు పలుకుట, నామోచ్చార ణము చేయుట. సాధారణముగ కొండెములు చెప్పువాడు పామువం టివాడు. వీడు చెవిని కఱచు పాముగ నున్నాడు. పాముచేత కఱవ బడినవాడు చచ్చునట్లు వీని చేత కఱవబడినవాడు చావడు. ఇతరుడు చచ్చును. ఇట్లగుటచేత వీడు విచిత్రమైన పాముగ నున్నాడు. భగవన్మం త్రము ఇట్టి శత్రువులను నశింపజేయునది. ఇది సకలోప నిషద్వాక్యములచేత స్తుతింపబడు మంత్రము. సంసారసముద్రమునుండి గట్టెక్కించు మంత్రము. మనయందు తమోగుణము అతిశయించి యున్నదే, అది పోవలదా యనిన ఇది తమోగుణసమూహమును నాశముగావించు గొప్పమంత్రముగ నున్నది. ఈ మంత్ర మైహికఫలముల నీయజాలదా యనిన - కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. భగ. 4అధ్యా. 12వశ్లోకమువలె వారివారికి కావలసిన దాని నిచ్చునట్టి మంత్రమిది. కామ్యకర్ములకును వేదమందు విశ్వాసము కలుగు కొఱకు వేద మందును అట్టిమంత్రములు చెప్పబడియున్నవి. అట్లు వేదమందు విశ్వాసము కలిగి చూచుచుపోగా నింతకంటెను హెచ్చైన సుఖమున్నదని కనుగొందురు.