मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 126, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 119 తరగుటయే ఫలము. కాలువ, గుంట, బావి మొదలగు వానిని త్రవ్విం చుట, ఆలయప్రతిష్ఠ, బ్రాహ్మణుల కిండ్లు కట్టించి యిచ్చుట, పూజసల్పుట, యాగాదులు చేయుట మొదలగు కార్యము లన్నియు బూదిలో చేసిన హోమమువలెనే యగును. అగ్నిలో చేసిన హోమమే సార్థకమైనది. ఇది అట్టి హోమము కానేరదు. గంగాది పుణ్యనదులలో స్నానము చేసిన ప్రయోజనమే గదా యనిన, ఆ స్నానము గజస్నానమే యగును. అటులైన పైని తెలుపబడిన సత్కా ర్యము లన్నియు వృథయేనా యనిన, భగవంతునియొక్క పాదారవింద ద్వయమందలి స్మరణ లేకపోయెనేని అన్నియు వృథయే యగును. భగవ ద్భక్తి లేక చేయు వేదాధ్యయనము వలన ప్రయోజనము లేదు. మఱచినచో అనర్థము కలుగును. వ్రతాదులు భగవన్ముఖోల్లాసమున కనియే గదా చేయు దురు? భగవంతు డున్నాడు. వాడు నన్ను కాపాడవలయును అను భావము లేక చేయు వ్రతాదులవలన ప్రయోజనము లేదు. చెరువులు త్రవ్వించుట మొదలగు సత్కార్యము లన్నియు నీశ్వరప్రీతి కలుగుటకే చేయ బడుచున్నవి. అట్టి భగవంతుని మరచి దాంభికముగ జేయు క్రియలు వృథ యగును. పుణ్యనదులగు గంగాదినదులలో స్నానమాచరించుట ఎందుకు? పాపక్షయమునకే కదా! భగవంతుని పాదప్రక్షాళన జలమగుటచేత గంగకు ప్రభావము గలిగెను. ఆ సంగతి నెఱిగి స్వామీ! నీ పాదధూళి గలసిన జలమున స్నానమాచరించెదను; కాపాడుము అను భావము లేనివాడు ఏ నీట మునిగిన నేమి? వాడు చేయు స్నానము గజస్నానమువలె వృథ యగును. ఏనుగు ఎదురు పడిన గుంట లన్నిటిలోను మునిగి గట్టెక్కి గనే తలమీద మట్టిని వేసి కొనును. మనము పాపము క్షీణించవలెనని గంగాదులందు స్నాన మాచరించినను మరల పాపములను చేయుదుము. ఇందులకే గంగాస్నాన ముదాహరింపబడెను. ఈ కారణములచేతనే భగవ త్పాదద్వయ సంస్మరణము లేక, భక్తిలేక చేయుకార్యములు వృథ యగును. అతనిని దలచి భక్తితో చేయు కార్యములే ప్రయోజనము గలవి. అట్టి నారాయణుడు ప్రపంచమునకు మీది వాడు అనగా సర్వోత్కృష్టుడు.