मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 128, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 121 వేశ్యాలోలుడయు దానియింటిలో వసించుచుండి అంత్యకాలమున ఆ దాసికి పుట్టిన నారాయణుడను తన పదియవకుమారుని బిలిచి ఆ కారణమున ముక్తి పొందెను. ఇక శ్రద్ధాభక్తులతో నుడివిన అడుగ వలయునా? ఇట్టి పవిత్రనామముండియు ప్రాణులకేల జన్మములేక పోలేదనగా పూర్వము మన వాక్కు భగవద్విషయమున ప్రవర్తింపని కారణము చేతనే. మన వాక్కేల ప్రవర్తింపలేదనగా హా=కష్టకాలము. అందుచేతనే గర్భవాసాది దుఃఖములు గలిగెను. పెద్దలొకరు భగవత్సన్నిధికి బోయి స్వామినుద్దేశించి, "స్వామీ! నేను రెండపరాధములు చేసితిని. నీ వాయు పరాధములను మన్నింప వలయును. పూర్వజన్మమున నేను నీకు భక్తితో నమస్కరింపలేదు. వచ్చు జన్మమునను నమస్కరించను. ఈ రెండ పరాధములను మన్నింపవలయును. పోయిన జన్మమున నమస్కరించని కారణముననే నా కీ జన్మము గలిగెను. ఈ జన్మమున సేవించిన కారణముచేతనే నేను ముక్తుడ నగుదును. అపుడును నమస్కరింపను" -- అని విన్నవించిరి. కులశేఖరు లీ రీతిననే చెప్పిరి. అపిచే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్, సాధురేవ స మంతవ్యః సమ్య గ్వ్యవసితో హి సః. -- గీత. 9.30శ్లోకమట్లు ఎట్టి దురాచారుడైనను భగవద్భక్తి గలిగి యుండెనేని శ్రేష్ఠుడగును. అపి చేదసి పాపేభ్య స్సర్వేభ్యః పాపకృత్తమః, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. గీత. 4.36శ్లోకమట్లు ఎట్టి పాపియైనను పాపమను సముద్రమును జ్ఞానమనెడు ఓడచేత దాటగలుగును. శ్వపచుడైనను అనగా కుక్కమాంస మును వండువాడైనను భగవన్నామమును చెప్పెనేని వాడు బ్రాహ్మణుని కంటె నధికు డగును. ఉత్తమబ్రాహ్మణుడైనను భక్తిహీనుడైనచో చండాలుడే.