मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 132, कुल 167 में से
संदर्भ में पढ़ेंనః=మనకు, నాథే=ప్రభుదును, త్రిజగతాం=మూడులోకములకు, ఏకాధిపే=ముఖ్యమైనపాలకుడును, చేతసా=మనస్సుచేత, సేవ్యే=కొలువ దగినవాడును, స్వస్య=తనదైవ, పదస్య=స్థానముయొక్క (శ్రీవైకుంఠము యొక్క) దాతరి=దాతయగు (ఇచ్చువాడగు) వాడును, పురుషోత్తమే=పురు షశ్రేష్ఠుడును, సురే=దేవుడైనవాడును నగు, నారాయణే=శ్రీమన్నారాయ ణమూర్తి, తిష్ఠతి సతి=ఉండగా, కతిపయగ్రామేశం= కొన్ని గ్రామములకు దొరయైనవాడును, అల్పార్థదం=స్వల్పమైనధనము నిచ్చువాడును, పురుషా ధమం=పురుషులలో అధముడైనవాడును నగు, యం కంచిత్ నరం=ఎవ నినో ఒక మర్త్యుని, సేవామై=కొలువుకొఱకు, మృగయామహే=వెదకు చున్నాము. అహో=అయ్యో, వయం=మనము, మూకాః=మూఢులము, వరాకాః=పనికిమాలినవారము. మనకు నాథుడును, పురుషోత్తముడును, త్రిలోకముల కేకాధిప తియును, మనసుచేత సేవింపదగినవాడును, తనయొక్క పదమునే యిచ్చువాడును, దేవుడైన శ్రీమన్నారాయణు డుండగా, పురుషాధము నును, కొన్నిగ్రామములకు నాయకుడును, అల్పధనము నిచ్చువాడును, విల్లిగవ్వకు కొరగాని ఒక నరుని గొలువ వెదకుచున్నాము. ఇది ఆశ్చర్యము. (ఇందుచేత) మనము మూగలము, దీనులము. జనులు : భగవద్దాసపరంపరయందు ఆఱవవానికి అనుదాసుడుగ నుండవలయునని భగవంతుని ప్రార్థించితిరి. అందుకే భగవంతుని మహిమ గొప్పదని తెలియుచున్నది. ఏదో కొంతపనియుండి అట్లు స్తోత్రము చేయుచున్నారా? లేక నిజముగానే అతనియందు మహిమ యున్నదా? కులశేఖరులు : అతని మహిమనుబట్టియే అట్లు స్తుతించితిని. జనులు : ఇతరులను గూడ స్తోత్రము చేయుదుము గదా? కుల : జీవనము జరుగుటకొఱకు మన మే మనుష్యుని స్తుతిం తుమో ఆ మనుష్యునికిని, భగవంతునికిని గల తార