मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 136, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 129
జాలదు. అందుచే నతడు నీకు చోటీయడు. శివుడేమో నీకు విరోధిగ నున్నాడు. అందుచే నతని నాశ్రయించి తండ్రి నెదిరింపజాలవు. మన్మ : శివునకును, నాకును, విరోధముండినను, నే నతనిని వేడుకొని నా తండ్రికిని, నాకును సరిపడలేదనియు, నా అన్నయగు బ్రహ్మదేవుడు వైదికుడుగాన అతని సహాయము లభింప దనియు చెప్పి నన్ను కాపాడు మనెదను. నా కపుడు తండ్రి భయముండదు. కుల : భగవంతుని ముందు శివు డెక్కడ? శివుని వద్ద వరము బడసిన నరకాసురుని మిత్రుడగు మురాసురుని అనా యాసముగ చక్రముతో ఖండించినవా డతడు. అట్లగుట చేత మన్మథా! నీ వతని చోటును వీడవలసినదే. స్వామిని దలచి హృదయమున నిలిపితిని. కాన నీవు నా సమీపమునకు రాకుము. శరణు పొందువఱకే భగవంతుడు గుణదోషము లెన్నునుగాని అటుపిమ్మట దోషము లెన్నడు. కులము, జ్ఞానము, కర్మానుష్ఠానము లను పాటింపడు. కులశేఖరులు భగవంతుని తలచిన మన్మథవికార ముండదని మనకు తెలియజేయుచున్నారు. మన్మథవికార ముండెనేని శేషత్వానుసంధానము కలుగదు. అన్యశేష పరిహారము కాజాలదు. మన్మథు డెట్లు పోవుననగా-- ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఆత్మ న్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే. -- గీత. 2.55 శ్లోక మట్లు భగవంతుని హృదయాకాశమున నిల్పిన యెడల తొలగును. భగవంతుని హృదయమున నిల్పుకొనిన యెడల కామక్రోధములు పాఱిపోవును. 10