मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 135, कुल 167 में से
संदर्भ में पढ़ें128 ముకుందమాల (త్వం=నీవు), హర=ఈశ్వరుని యొక్క, నయన=తృతీయ నేత్రము యొక్క, కృశానునా=అగ్నిచేత, కృశః=సన్నగిల్లినవాడవు (బూడిదయైన వాడవు), అసి=అయితివి, మురారేః=శ్రీకృష్ణుని యొక్క, చక్ర పరా క్రమం=సుదర్శనమను చక్రము యొక్క బలిమిని, న స్మరసి=తలంప వైతివి. ఓ మన్మథుడా, శ్రీముకుందుని పాదకమలములకు స్థానమైన నా మనసును విడిచిపొమ్ము. రుద్రుని నేత్రాగ్నిచేత కాల్పబడితివి. మురవైరి చక్రము యొక్క పరాక్రమమును దలంపవు. హృదయమున మన్మథవికారముండెనేని ఈ ముకుందమాల యొక్క 27వశ్లోకమున ప్రార్థించినట్లు శేషత్వానుసంధానము కలుగదు. దశరథు నంతటివాడు కూడ మన్మథ వికారమునకు లోబడి కైకమాట విని శ్రీరామ చంద్రు నరణ్యమునకు బంపెను. కులశేఖరు లీ కారణముచేత మన్మథుని తఱిమి వేయవలెనని తలంచిరి. ఎట్టి దుష్టపుత్రుడైనను, పాండిత్యము, ధనము, అధికారము మొదలగు వైభవములతో గూడియుండు తండ్రికి భయ పడును. ఎదుట నిలువజాలడు. కులశేఖరు లీ యుపాయము ననుసరించి మన్మథుని తొలగించవలయునని యెంచి యిట్లనుచున్నారు. కులశేఖరులు: ఓ మన్మథుడా! (మీతండ్రియగు) ముకుందుని యొక్క పాదారవిందములను నా మనసున నుంచుకొంటిని. అందుచే నిది నీ తండ్రి యునికిగ నున్నది. కాన నీ విచ్చోటి నుండి పొమ్ము. మన్మథుడు: నే నెంతమాత్రము కదలను. కుల : కదలిననే సరి. కదలకున్న కష్టము సంభవించును. మన్మ : బ్రహ్మదేవు నాశ్రయించెదను. కుల : బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క కుమారుడే గద. యోగ్యుడగు కుమారుడు తండ్రికి వ్యతిరేకముగ నడువ