मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 147, कुल 167 में से
संदर्भ में पढ़ें140 ముకుందమాల గీత. 3.21శ్లోకమువలె తా మాచరించి యితరుల చేత నాచరింప జేయుటకయి యవతరించినవారు గాన కులశేఖరులు ఇతరు లెఱుగునట్లు నారాయణనామమును వచించెద ననిరి. మనసున లేనిదే నామోచ్చారణచేయుటకు వీలుపడదు, గాన, నారాయ ణతత్త్వమును స్మరించెద ననిరి. నారాయణ తత్త్వమును స్మరించుటచేత వాని నామోచ్చారణకు అది హేతు వగును. నామోచ్చారణ చేయువాడు వానిని పూజించును. అటు పిమ్మట సేవించును. 36 శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే, శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. 37 అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి, వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చి దహోజనానాం వ్యసనాభిముఖ్యమ్! శ్రీనాథ=శ్రీవల్లభా, నారాయణ=జలశాయి యయి యుండువాడా, వాసుదేవ=వసుదేవుని పుత్తుఁడా, శ్రీకృష్ణ= ఓ కృష్ణా, భక్తప్రియ=భక్తుల కిష్టు డైనవాడా, చక్రపాణే=సుదర్శనమనుచక్రమును చేత ధరించినవాడా, శ్రీప ద్మనాభ=ఓ పద్మనాభా, అచ్యుత=నాశరహితుడా, కైటభారే=కైటభుడను రక్కసుని సంహరించినవాడా, శ్రీరామ=ఓ శ్రీరామమూర్తీ, పద్మాక్ష=కమల ములను బోలిన కన్నులుగలవాడా, హరే=ప్రళయకాలమందు బ్రహ్మరుద్రా దుల నందఱిని హరించువాడా, మురారే=ఓ మురాంతకుడా,