मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 154, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 147 హృత్కమల మధ్యమున నెల్లప్పు డుండువాడును, ఆశ్రితులకు అభ యమిచ్చువాడును, అవ్యయుడును, అనంతుడునగు శ్రీమహావిష్ణు నెవరు తలచెదరో వారు శ్రేయస్కరమైన విష్ణుస్థానమగు పరమపదమును పొందు చున్నారు. కులశేఖరులు: నాశనములేని, అంతములేని విష్ణువును ధ్యానించవల యును. ప్రశ్న : అంతపెద్దవానిని లోపల దించుటకు సాధ్యమగునా? కుల : హృదయ మందే ఉన్నాడు. ప్రశ్న : అతడు పరుగెత్తిన నెట్లు? కుల : ఎల్లప్పుడును ఉన్నాడు. ప్రశ్న : అతడేమి చేయును? కుల : నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అను భగవద్గీత 2అధ్యా. 40శ్లోకమట్లు సమాధియుక్తునికి అభయ మిచ్చును. ప్రశ్న : అభయమేనా? కుల : మోక్ష మబ్బును. ధ్యానము, జ్ఞానము ముదిరి ప్రకృతి వీడి వైష్ణవము కలుగును. 39 క్షీరసాగర తరంగ శీకరా సార తారకిత చారుమూర్తయే, భోగిభోగ శయనీయ శాయినే మాధవాయ మధువిద్విషే నమః