भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 159, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 159

[Header] ముకుందమాల 153

కులశేఖరాళ్వారు ధర్మనీతులతో రాజ్యమేలుచుండెను. కులశేఖరులు రాజైయుండుట చేత మనకేమి లాభము? వారికి వైష్ణవదీక్ష కలుగవ లదా? అందుల కాచార్యు డుండవలయును. కులశేఖరులకు సామాన్యుడైన ఆచార్యుడు పనికిరాడని యెంచి భగవంతుడు తన సేనాని · విష్వక్సే నుని పిలిచి పంచసంస్కార పూర్వకముగ సకల తత్త్వము లుపదేశింపుమని యాజ్ఞాపించెను. అతడట్లే చేసిపోయెను. పంచసంస్కారము లనగా 1) తాపము -- అనగా అగ్నియందు శంఖచక్రములను తప్తముగావించి భుజ ములందు ధరించుట 2) పుండ్రము 3) నామము అనగా దాసుడను పేరు 4) మంత్రము 5) యాగము. పరమైకాంతు లగుటకు ఈ యైదును కారణమని గ్రంథములు చెప్పుచున్నవి. కులశేఖరులు రాజ్యమేలునపుడు నిరంతర పురాణ శ్రవణము చేయు చుండిరి. పురాణము లేని దినమే ఉండదు. ఇట్లు పురాణశ్రవణము చేయునపుడు శ్రీరంగ విమానము బ్రహ్మపూజలో నుండి ఇక్ష్వాకునకు, అటుపై శ్రీరామ చంద్రునకు వచ్చెననియు, శ్రీరాముడు విభీషణున కీయగా అది ఈ లోకముననే నిలిచెననియు విని, యిట్టి క్షేత్రమునకు బోయి శ్రీరంగనాథుని సేవింపవలయుననియు కోరిరి. వారు వైష్ణవాగ్రేసర సార్వభౌములై యుండిరి. రంగేశపాదార్పిత చిత్తవృత్తులైయుండి రేపు శ్రీరంగ యాత్రకు పోవలయు నని తుడుము వేయించగా నెల్లవారును సంసిద్ధమై యుందురు. రాజకార్యము లుండుటచేత పయనము నిలువగా మరల రేపు ప్రయాణమని చాటింప జేయుదురు. ఇట్లుండి యొక నాడు ప్రయాణము కాగా, వీరు ఆ క్షేత్రమునకు బోయిన మరలి రారని యెంచి మంత్రులు చందనాదు లలది భగవన్నామము నుచ్చరించు చుండు వైష్ణవోత్తములను ఎదురుగా వచ్చునట్లు చేసిరి. కులశేఖరులు ఆస్వాము లను దర్శించి 'మాటలాడునట్టి వీరిని ఆరాధింపక మాట్లాడనట్టి ఆ స్వామి దర్శనమునకు బోవుట మంచిపని కా'దని తలచి వారిని సేవించి ఊరికి పిలుచుకొనిపోయి శుశ్రూషసేయుచు భోజనాది సౌకర్యములు కలిగించి, సదా ప్రేమభాషణములతో కాలము పుచ్చుచు, భగవత్కైంకర్యము మరల

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या) · पृष्ठ 159, कुल 167 में से · BharatKosha