मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 161, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 155 అనగా క్రూరకర్మములు చేయుచుండు రాక్షసులు పదునాల్గు వేల మంది; రాము డొక్కడే. యుద్ధమెట్లు ముగియునో యని ఆకాశమున దేవతలు, ఋషులు ఏడ్వనారంభించిరి -- అని పౌరాణికుడు చదువగా విని భక్తిచేత ఖరదూషణాదు లొకవైపు నిలిచినట్లును, శ్రీరాము డొక్కడే ఒకతట్టు నిలిచినట్లును, ఎల్లవారు దుఃఖించు చున్నట్లును భావించి ఇట్టి సమయమున శ్రీరామునకు సహాయము చేయని జన్మ మెందుకని తలచి సేనాపతిని బిలిచి సర్వసైన్యముల సమాయత్తము గావింపుమని ఆజ్ఞాపిం చెను. వా రతనికి పిచ్చిపట్టిన దని తలచి సర్వము సిద్ధమై యున్నదని తెలిపిరి. త్వరితముగ రండని చెప్పి కులశేఖరులు పరుగెత్త నారంభించిరి. కేవల తన్మయత్వము నొందిరి. భరతముని యొక నాటకము వ్రాసి దాని నప్సరసలకు జెప్పించి ఇంద్రునిముం దాడించెను. అపుడు త్రిమూర్తులును అచ్చట నుండిరి. రంభ వరుణుని భార్యవేషము, ఊర్వశి లక్ష్మీ వేషము వేసిరి. వరుణుని భార్య లక్ష్మినిజూచి “అమ్మా! ఇందరిలో నీ కెవ్వనియందు కోరిక యున్న"దని యడుగగా, లక్ష్మీవేషధారిణియైన ఊర్వశి పురుషోత్తముని మీద నాకు ఇచ్ఛగలదని చెప్పుటకు మాఱుగ “పురూరవుని మీద ననురాగము గల” దని చెప్పెను. ఊర్వశి తాను లక్ష్మియనియే భావించి యుండవలయును. ఆ భావమే మనసున నాటియుండవలయును. ఆమె అట్లు చేయలేదు. కనుక ఆమెను నీ వీ లోకమున ఉండదగవని భరతముని శపించెను. కులశేఖరులు శ్రీరాముని యందు మనస్సును లయింపజేసి నందున 'రామా! ఇదిగో వచ్చుచున్నాను' అనుచు పరుగెత్తుచు పోయెను. మంత్రులు యోజించి ఖరదూషణాదుల వధయైన ఘట్టమును చదివిననే యితడు తిరుగునని నిశ్చయించి -- “అర్ధాధికముహూర్తేన రామేణ నిశితై శ్శరైః, చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం.