भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 162, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 162

156 ముకుందమాల

ఖరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే, అహో బత మహత్కర్మ రామస్య విదితాత్మనః. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహమ్, బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిష్వస్వజే."

ఒకటిన్నర ముహూర్తముల కాలములోనే రాముడు పదునుగల బాణము లతో ఖరదూషణులు నాయకులుగా గల, భయంకరమగు వ్యాపారముగల పదునాల్గువేలమంది రాక్షసులను యుద్ధములో జంపెను. ఆత్మస్వరూ పము నెఱింగిన రాముడు చేసిన గొప్పకార్యము ఆశ్చర్యముగా నున్నది. శత్రుసంహారకుడును, మహర్షులకు సుఖము నిచ్చువాడును, తన భర్తయగు శ్రీరాముని జూచి సీతాదేవి సంతోషించి ఆలింగనము చేసి కొనెనని పౌరా ణికుడు చదువగా కులశేఖరులు "సైనికులారా! సంహార మాయెను. ఇక మరలిరం" డని వెనుకకు దిరిగెను.

అది మొదలు పౌరాణికుడు శ్రీరామునకు కష్టము వచ్చినదను సంగతిని దెలుపు శ్లోకములను విడిచి చదువుచుండెను. ఒకనాడు రామాయణము చదువుచుండిన బ్రాహ్మణునకు పనియున్నందున అతడు తన కుమారుని బంపెను. ఈ రహస్య మెఱుగని ఆ బ్రాహ్మణుడు రామాయణమును జదువ నారంభించి అరణ్యకాండములో --

"జగ్రాహ రావణ స్సీతాం బుధః ఖే రోహిణీ మివ" ఆకాశములో సుఖ ముగ సంచరించుచుండు తల్లియగు రోహిణిని బుధుడు పట్టుకొనినట్లు రావణుడు సీతను పట్టుకొనెను అను ఘట్టమును జదివెను.

జగన్మాతను ఇతరు డెత్తుకొనిపోవుటయా, లేవరా యని కులశేఖ రులు లంకకు బయలుదేతెను. సముద్రము అడ్డము వచ్చినను నిజభక్తితో దిగిపోవుచుండిరి. అపుడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణుల తోడ దర్శన మిచ్చి నీవు వచ్చులోపలనే నేను వానిని సంహరించితి నని పలికి అంతర్ధా