मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 19, कुल 167 में से
संदर्भ में पढ़ें12 ముకుందమాల అనునట్లు ఒక తలగల పాము, పెక్కు తలులుగల పాము అని సర్పములలో రెండు భేదములు చెప్పబడినవి. భగవంతుడు అనేక శిరస్సులుగల నాగముపైని శయనించియున్నాడు; కోపమును పోగొట్టుటకు లక్ష్మీదేవిని వక్షఃస్థలమున నుంచుకొనియున్నాడు. శత్రునిరసనమునకు ఆది శేషుని ఉంచుకొని యున్నాడు. అజ్ఞానమును బోగొట్టుటకు చక్రమును, జ్ఞానమును గలిగించుటకు శంఖమును ధరించియున్నాడు. భూమి రాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా. -- గీత. 7.4 అని గీతలో చెప్పినట్లు జడప్రకృతి నుంచుకొని సృష్టించువాడు. యావత్సంజాయతే కించి త్సత్త్వంస్థావరజంగమమ్, క్షేత్రక్షేత్రజ్ఞసంయోగా త్తద్విద్ధి భరతర్షభ. -- గీత. 13.27 అను శ్లోకము రీతిగ సృష్టించువాడు. ఓ ముకుందా! జగన్నివాసా యనిపించుము. జగన్నివాసు డనగా మత్తః పరతరం నాన్యత్కించి దస్తి ధనంజయ, మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. -- గీత. 7.7 అనుశ్లోకమట్లు సృష్టించిన దానిలోపల ప్రవేశించియుండువాడు. దార మునందు ముత్యము వలె భగవంతునియందు సకలమును గ్రుచ్చబడియు న్నది. భగవంతుడు ఎన్నరాని యుపకారములను చేయుచున్నాడు. వానిలో మనలను ధరించుట యనునది మిగుల హెచ్చైన కార్యము. ధరించువాడు లేకుండిన జారిపడిపోవును. ఆదికూర్మరూపముతో ధరించుచు కాపాడు చున్నాడు.