मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 20, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 13 గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా, పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః. -- గీత. 15.13 పరమేశ్వరుడు భూమిలోపల ప్రవేశించి ఆమెకు ధరించు శక్తి గల్గించి యుండుటచేతనే మనము నిర్భయముగ నున్నాము. భగవంతుడు ఒక్కొక్క పదార్థము లోను ప్రవేశించియున్నాడు: అణు వులో నణువై మహత్తునకు మహత్తయి యున్నాడు. నారాయణ శబ్దార్థమును చూడగా నారాణాం అయనం యః సః నారాయణః. నారములకు స్థాన మెవ్వడో వాడు నారాయణుడు. మఱియొక యర్థము: నారాః అయనం యస్య సః నారాయణః-నారము లెవ్వనికి స్థానమో వాడు నారాయణుడు. ఈ కారణముల చేత భగవంతుడు జగన్నివాసుడు. కులశేఖరులు భగవద్గుణములను పుంఖానుపుంఖముగ వర్ణింపవలసి యుండగా అట్లు చేయక భగవన్నామములను తమ వాక్కున నుచ్చరింప జేయుమని భగవంతు నేల ప్రార్థింపవలయును? అనగా భగవన్నామము మనయొక్క సకలశ్రమముల పరిహరింప జేయునట్టిదిగ నున్నది. తిరుమం త్రార్థము 14వ వాక్యమున భగవద్వైభవము కంటెను వాని మంత్రవైభవము అధికమైనదనియు, 15వ వాక్యమున భగవంతుడు దూరముగనుండినను మంత్రము సమీపమున నుండి రక్షించుననియును, 16వ వాక్యమున ఆపదయందు ద్రౌపదికి వస్త్రము లిచ్చి కాచిన దీ మంత్రమే కదా యని యును చెప్పబడెను. మఱియును 17వ వాక్యమున భగవన్నామము మనకు కష్టకమైనదని తెలిసి భక్తిశ్రద్ధాపురస్సరముగ చేయకపోయినను కాపాడును. పరిహాసమునకో, ఇతరులు చెప్పిరనియో, బిడ్డల పేరు అనియో, పాట పాడునపుడు తాళము సరిపోవుటకో, దూషించుటకో-ఏ విధముననైనను అప్రయత్నముగ చెప్పినను భగవన్నామము దాని స్వభావమును విడువదని జెప్పబడినది.