भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 22, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 22

ముకుందమాల 15 వచ్చును. ఎవ్వడైనను తన్ను భగవంతుడు కాపాడవలయునని కోరునేని భగవంతునికి తన యభిప్రాయమును దెలుపుటకై యతని నామమునే పంపవలయును. అనగా భగవంతుని నామమును స్మరించిన భగవంతుడు కాపాడును. తిరుమంగైయాళ్వారులు ‘వాడినైన్’ అనుమొదటి పాశురమున నిట్లు చెప్పిరి. తల్లి మొదలగువారు పరమబాధకులు. ఇహమున కష్టించి సంపాదించిన వీరు అనుభవింతురు. పరమున నేను నరక మనుభవింప వలసి యుండుటచేత వీరు శత్రువులు. అట్లు తెలియక వీరిపై శరీరముతో అల్లాడితిని. మనసుతో సంకటపడితిని. జన్మమన దుఃఖ స్వరూపము, దుఃఖహేతువు. అట్టి సంసారచక్రమున బడి దేహమే ఆత్మయని తలచి నేను నేనని యెంచి ఒకటిగ గూడితిని. శరీరముతో గూడి అల్లాడితిని. మరల మరల పుట్టి అల్లాడితిని. పెద్దలు, తల్లి, తండ్రి, ఆచార్యులు మొద లగువారి మాట వినక ఆలుబిడ్డలను, వారియాలోచనలను అనుసరించుచు, నాచేత కాపాడబడునట్టి వారి మాటలు వింటిని వారిని యజమానస్థానమున నుంచితిని. వారిచ్చు సుఖము స్వల్పము, విరసము. విషయేంద్రియసంయోగా ద్యత్తదగ్రేఽమృతోపమమ్, పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్. -- గీత. 18.38 అది రాజస సుఖమని చెప్పబడినది మెఱుపువలె క్షణముండు నట్టిది. మునుకుండు చీకటికి ఇట్టి వెలుగు ఉపయోగించునా? ఇట్టివారికై పరుగె త్తితిని. అట్లు పోయి చెడితిని. ఇట్లెన్నో జన్మములకు భగవంతుని కృప యను వస్తువు దొరకెను. కృపయను దొడ్డపదార్థము దొరకగనే జ్ఞానము గలిగెను. దానితో చూడగా ఆత్మస్వరూపోజ్జీవన మార్గము దొరకెను. అది యేమి యనిన- నారాయణనామము. దానిని నేను కనుగొంటిని. అనేక ములగు సుఖదుఃఖములం దుండు మీరు ఎఱుగలేరు. నేను చెప్పెదను. రండు, వినుడు” అనిరి. దీనిలోనే 9 పాశురమున నిట్లు చెప్పబడినది. నారాయణ యను నామము కులము నిచ్చును. ఐశ్వర్యము నిచ్చును. శేషభూతులు అనుభవించు దుఃఖరూపమగువాని నన్నిటిని నశింపజేయును.

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या) · पृष्ठ 22, कुल 167 में से · BharatKosha