भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 27, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 27

20 ముకుందమాల నీవు పాపివి అని, భగవన్నామము చెప్పెను. ఆ పాపమును కూడ మ్రింగు మని పాపము చెప్పెను. కాన భగవన్నామము పాపములను హరించు లోపల మఱియును పాపముసేయ వలను పడదు. ఇత్యాదులైన అనేక కారణములచేత భగవన్నामोచ్చారణము సంసారసాగరమును దాటించుటకు ప్రథమసాధనమని తెలియుచున్నది. ఇట్టి భగవన్నామమును కులశేఖరులు నిరాతంకముగ నుచ్చరింపక తమ వాక్కున వచ్చునట్లు చేయుమని భగ- వంతు నుద్దేశించి "ఓ ముకుందా! (నీవు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములం దున్నావు. హృషీకేశుడ వగుట చేత నా వాక్కున గూర్చుండి) నీ నామము వెడలునట్లు చేయు" మని ప్రార్థించిరి. అట్లు ప్రార్థించుటకు హేతు వే మనగా -- నైవ కించి త్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్ర న్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్ విసృజన్ గృహ్ల న్నున్మిష న్నిమిషన్నపి, ఇంద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్. -- గీత. 5.8,9 అను శ్లోకములందు చెప్పినటులు నిదుర లేచినది మొదలు మరల నిద్రించువఱకు చేయుచుండు పదుమూడు కార్యములందును అనగా చూచుట, వినుట, తాకుట, వాసనచూచుట, భుజించుట, నడచుట, నిద్రిం- చుట, ఊపిరివిడుచుట, మాటలాడుట, వదలుట, గ్రహించుట, కన్నులు తెఱచుట, కన్నుమూయుట అను కార్యములందును మనకు కర్తృత్వము లేదు. నారాయణేతి మంత్రోఽస్తి వాగస్తి వశవర్తినీ, తథాపి నరకే ఘోరే పతంతీ త్యేతదద్భుతమ్. 'నారాయణ' అనెడి మంత్ర మున్నది. మనకు స్వాధీనమైన వాక్కు- న్నది. అయినను ఘోరమైన నరకకూపములో బడిపోవు చున్నారము అను సంగతి చూడగ చాల ఆశ్చర్యము. ఇందుచేత భగవత్ప్రేరణ లేకయే అతని నామము మన నోటరాదు.