मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 31, कुल 167 में से
संदर्भ में पढ़ें24 ముకుందమాల 2 జయతు జయతు దేవో దేవకీనందనోఽయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. దేవకీనందనః = శ్రీదేవకీదేవియొక్క పుత్తుండగు, అయం = ఈ, దేవః = భగవంతుడగు శ్రీకృష్ణుడు, జయతు జయతు = అందతికంటె నుత్కృష్టుం డగునుగాక, వృష్ణివంశప్రదీపః = వృష్ణివంశమను యాదవవం శమునకు ప్రకాశము కలుగజేయువాడయిన, కృష్ణః = శ్రీకృష్ణపరమాత్మ, జయతు జయతు = సర్వోత్కృష్టుం డగుగాక, మేఘశ్యామలః = మేఘ మువలె నల్లని దేహకాంతిగల, కోమలాంగః = మెత్తని అవయవములుగల శ్రీకృష్ణ భగవానుడు, జయతు జయతు = సర్వదేవతలకంటె నధికుడగు గాక, పృథ్వీ = భూమియొక్క, భార = బరువును, నాశః = పోగొట్టునట్టి, ముకుందః = శ్రీకృష్ణమూర్తి, జయతు జయతు = సర్వోత్కర్షతో విరాజిల్లుగాక! దేవకీ పుత్తుండగు దేవునకు మఱియు మఱియు జయము గలుగు గాక! వృష్ణివంశమునకు ప్రకాశకుడైన శ్రీకృష్ణమూర్తి పునః పునః జయశాలి యగుగాక! వర్షాకాలపు మేఘమువలె నల్లనివాడై, కోమలములగు నవయ వములు గల శ్రీకృష్ణుడు జయశాలి యగుగాక! జయశాలి యగుగాక! భూభారమును పోగొట్టువాడైన ముకుందుడు జయించుగాక, జయించుగాక! శ్రీవల్లభేతి యను శ్లోకములో ఉదాహరింపబడిన భగవన్నామములలో ఒక్క శ్రీవల్లభా యనుటకు అర్థమును జూచినను భగద్వైభవము వ్యక్త మగు చున్నది. సమోఽహం సర్వభూతేషు న మేద్వేష్యోఽస్తి న ప్రియః, యే భజన్తితు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్. -- గీత. 9.29