मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 30, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 23 ఈ శ్లోకమునందు ప్రతి భగవన్నామమునకు 'ఇతి' చేర్చి చెప్పబడియు న్నది. 'ఇతి' యనగా 'అని' యర్థము. శ్రీవల్లభ ఇతి, వరద ఇతి, దయాపర ఇతి, భక్తప్రియ ఇతి, భవలుణ్ఠన కోవిద ఇతి, నాథ ఇతి, నాగశయన ఇతి, జగన్నివాస ఇతి-అనగా శ్రీవల్లభాయని, వరదాయని, భక్తప్రియాయని, భవలుంఠన కోవిదాయని, నాథాయని, నాగశయనాయని, జగన్నివాసాయని నా నోట పలికించుము అని యున్నది. అట్లు ప్రతి భగవన్నామము నకు 'ఇతి' చేర్చి చెప్ప నవసరము లేదు. శ్రీవల్లభా, వరదా, దయాపర, భక్తప్రియా, భవలుణ్ఠన కోవిదా, నాథా, నాగశయనా, జగన్నివాసా అని అనిపించుము అని అన్నినామములను చెప్పి కడపట 'ఇతి' చేర్చి చెప్పియుం డవచ్చును. కులశేఖరు లట్లు చేయక ప్రతి భగవన్నామమునకును ప్రక్క 'ఇతి' చేర్చి చెప్పుటలో ఒకవిశేష మున్నది. శ్రీవల్లభ మొదలు జగన్నివాస వఱకు గల నామములను జెప్పి కడపట 'ఇతి' ప్రయోగించు పక్షమున పైజెప్పిన నామముల నన్నింటిని నానోట వచ్చునట్లు చేయుమని యర్థ మగును. అపుడు అన్నినామముల నుచ్చరించిననే మోక్షము కల్గునని యర్థ మగును. ప్రతి భగవన్నామము తోడను 'ఇతి' చేరియుండుటచే శ్రీవల్లభా అని యనిపించుము చాలును; లేక వరదా అని యనిపించుము. అట్లు గాకున్న దయాపరా అని యనిపించు మని యిట్లే ఒక్కొక్కనామమును చెప్పి అడిగిన ట్లగును. ఒక్కొక్కనామము నుచ్చరించినను చాలునన్న యర్థము తెలుపబడినది. అందుచేతనే కులశేఖరులు అట్లు 'ఇతి, ఇతి' యని ప్రయోగించిరి. ఒక్కొక్క భగవన్నామమునకు మోక్ష మిప్పించునంతటి శక్తి యుండె నేని కులశేఖరులు నారాయణా అనిపించుము అని ప్రార్థించియుండ రాదా? ఇన్ని భగవన్నామముల నెత్తి చెప్పి వాని నన్నింటిని చెప్పించుమని వేడనేల యనిన, భగవన్ముఖోల్లాసమునకు ఆతని ఒక్కనామమే చాలి యుండినను అనేక నామములను జెప్పుటచేత అతని యనేక కల్యాణగుణములను వర్ణిం చిన ట్లగును. అట్లు వాని గుణానుభవము చేయుటకే కులశేఖరు లనేకనామముల నుదాహరించిరి.