मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 34, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 27 దేవః అనగా సృష్టి స్థితి లయములను లీలగా చేయువాడని యర్థము. జ్ఞానము నిచ్చువా డనియు నర్థము. 'దివ్' అనుపదమునకు 19 అర్థములు గలవు. ఆ వస్తువు శుభముగ నుండని మ్మనిరి. ఈ రీతిగ నిత్యవిభూతిని దలచి భగవంతు డెట్టి మాహాత్మ్యము గలవాడని యాశ్చర్యపడి అంతలో నతని సౌలభ్యము నిట్లు యోజించెను. నిత్యసూరులు పుష్పము, ధూపము మొదలగు వానిని గైకొనుడని ప్రార్థించు చుండగా వాని నంగీకరింపక, బద్ధాత్మలను కాపాడుటగదా ముఖ్య మని సంకల్పించి ఆ లోకమునం దవ తరించెను. ఎట్టి పరత్వముగలవా డెట్టి సౌలభ్యము గలవాడై యున్నాడని యానందించెను. సాధారణముగ నొక విలక్షణమైన బిడ్డను చూచినపుడు వానిని గన్న తల్లి యెట్టి భాగ్యవతియో యని ప్రశంసించుట లోకానుభవమే. ఆ విధముగనే కులశేఖరులు పరత్వ సౌలభ్యములతో గూడిన భగవంతుని దలచి అట్టివానినిగన్న దేవకీదేవి జ్ఞప్తికి రాగా ' దేవకీనందనః' అనిరి. రామా యణమునందును 'కౌసల్యానందవర్ధనః' అని రాముని గూర్చి చెప్పబడెను. తిరుప్పావునందును "తాయైక్కుడల్ విళక్కుశ్ శెయ్ద దామోదరనై" అనగా తన యవతారముచేత తన తల్లియొక్క గర్భసమానము వేరొక్క గర్భము కాదని పట్టము గట్టినవాడు త న్నాశ్రయించినవారి బంధమోచనము గావిం చువాడై యుండియు, తల్లికి స్వాధీనుడనైతినని తెలుపుటకు దారముచేత గట్టబడె ననియును తెలుపబడెను. పరబ్రహ్మమని కొనియాడబడు వస్తువు లోకోద్ధరణార్థము మధురాపట్టణమునం దాదుచున్నది. మధురభాగ్య మేమని వేదాంతదేశికులు గోపాలవింశతి యందు దెలిపిరి. ఆ శ్లోక మిది -- వ్రజయోషి దపాంగవేదనీయం మధురాభాగ్య మనన్యభోగ్య మీడే, వసుదేవవధూస్తనంధయం తత్ కి మపి బ్రహ్మకిశోర భావగమ్యమ్. దేవః, దేవకీనందనః-అను రెండు పదములచేత భగవంతునియొక్క పరత్వ సౌలభ్యములు తెలుపబడెను. దేవకీదేవి పుణ్యాత్మురా లగుటచే