भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 35, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 35

28 ముకుందమాల దేవకీనందను డని చెప్పబడెను గాని స్వామియొక్క సొంతపేరును గదా చెప్పవలయును? అతని పేరు కృష్ణ డనగా సాక్షాత్ పర బ్రహ్మము. ఈ కృష్ణ శబ్ద ప్రయోగమునకు మఱియొక్క కారణము, వేఱువిధమైన ప్రశ్న తెలుప బడుచున్నవి. ఏ మనగా ఈ రెండవ శ్లోకమునకు ప్రథమపాదమున దేవః -- అనగా జగత్సృష్ట్యాదులను లీలగా చేయు వాడని చెప్పబడెను. అందుచే నట్టికార్యము చేయుటచేతనే యతనికి గొప్పతనము గలదని యేర్పడుచున్నది. అత డిట్లు జగత్సృష్ట్యాదులను జేయకుండు పక్షమున ఘనుడు కాజాలడా? లోకమునందు ఏపనియును చేయకుండ కూర్చుండు వాడు కదా గౌరవనీయుడుగ నెన్నబడుచున్నాడు? ఇందుకు సమాధాన మతడు మనకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శరీర మనోబుద్ధుల నిచ్చి కాపాడ దలచి జగత్సృష్ట్యాదులు చేయుచున్నాడు. అత డట్లు చేయకున్నను కృష్ణః -- అనగా పరిపూర్ణానంద స్వరూపుడు. అవాప్త సమస్తకాముడు. సరి. తల్లిని సుఖపెట్టుట ఒక హెచ్చైన సంగతిగ తోచలేదు. అనగా నింతమాత్రమేకాక వృష్ణివంశప్రదీపః -- స్వామి తన తల్లిని మాత్రమే సుఖపెట్టలేదు. వృష్ణివంశమునకే సుఖము గల్గించెను. తిరుప్పావు నందును "మణివిళక్కై" -- మంగళకరమైన దీపమువంటివాడై అని స్వామియొక్క సంగతి చెప్పబడినది. ప్రదీపః -- గొప్పదీపము. ఆ వృష్ణివంశమునకు స్వామి గొప్పదీపము వలెనుండెను. ఈ శ్లోకము యొక్క రెండుపాదములచేత చెప్పబడునట్టి పదార్థము గొప్పదనియు, దాని ననుభవింపవలయుననియు తెలియుచు న్నది. ప్రసిద్ధౌషధమైనను చేదుగ నుండెనేని దానిని పుచ్చుకొనుట కష్టము కదా! భగవన్నామమును, అతని కథను, ధ్యానమును, నిత్యవిభూతిని, లీలా విభూతిని, యోజించినటులైన అతని మాహాత్మ్యము తెలియవచ్చును. ఎంత గౌరవము గలిగి యుండినను ఆ పరమాత్మ సౌందర్యము గలిగియుండిననే, మనసు లయించును. కాన అతని కేమైన సౌందర్యము కలదా యనిన