मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 36, कुल 167 में से
संदर्भ में पढ़ें| ముకుందమాల | 29 |
|---|
మేఘశ్యామలః -- మేఘమువంటి నలుపుగలవాడు. మేఘమని తెలుపుటచేత స్వామియొక్క అందము తెలియుచున్నది. మేఘమువలన వర్షమువచ్చును. వర్షము వలన అన్నము, దానివలన ప్రజావృద్ధి కలుగును. మేఘము తాపప రిహారము చేయును. గ్రీష్మకాలమున తపించువారికి వర్షాకాలపు మేఘము హాయినిచ్చునట్లు శ్రీరామదర్శనము సౌఖ్యప్రదమని రామాయణమున చెప్ప బడినది. మేఘశ్యామలః -- అను పదము దయాపరా అను పదముయొక్క అర్థమును సూచించుచున్నది.
కోమలాంగః -- వట్టి మేఘమును ఆశ్రయించిన ఫలమేమి? కోమ లాంగు డనుటచేత నీటి నుంచుకొనియుండు మేఘమువంటి అందము గలవాడని యర్థము. శ్రీకృష్ణమూర్తి యవతరింపగనే వసుదేవుడు 'తమ ద్భుతం బాలకం' అని స్వామియందమును వర్ణించెను. 'మణేవణ్ణన్' ఇంద్ర నీలమణివంటి తిరుమేని కాంతిగలవాడు. ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక తాపహరుడు, పురుషమోహనుడు.
ఈ శ్లోకము యొక్క మూడవ పాదమునందు స్వామి సౌందర్యము వర్ణింపబడెను. అతడు సౌందర్యవంతుడే. అతని నాశ్రయింపవలసినదే, కాని మనము పిలిచినయెడల వచ్చునా? పృథ్వీభారనాశః --
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. -- గీత. 4.8
అని చెప్పినట్టివాడు, అట్లు పిలిచిన రానివా డయ్యెనేని మత్స్యవరాహాద్యవ తారముల నెత్తియుండునా? భక్తుల క్షేమార్థమే గదా అతని యవతారము కలుగును? అతనికి పరోపకారమే ఘనకార్యము. అతడు పృథ్వీభారనా శకుడు గనుక పిలిచిన వచ్చును. అడిగిన వరముల నిచ్చును. కాని, అతడిచ్చు సుఖములు ఐహికమున కుపయుక్తముగ నుండును. మోక్షము