मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 69, कुल 167 में से
संदर्भ में पढ़ें62 ముకుందమాల హరిమేవ సంతతమ్” అని చెప్పినది పొరపాటని తలచిరి. అట్లు తలచి మన సుతో జరుగవలసిన కార్యముగాన దానిని వేడుకొనుట కర్తవ్యమని యెంచి ఇట్లు ప్రార్థించిరి. కులశేఖరులు: ఓ మనసా! స్వామితో చెప్పితిని. నా మానమును కాపాడుము. నీవు పలుచోట్ల తిరుగుచుంటివేని నాకు గత్యంతరము లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః. -- గీత. 6.5 అనునట్లు నీవు నాకు బంధువుగ నున్నావు. న రూప మస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా, అశ్వత్థమేనం సువిరూఢమూల మసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా. -- గీత. 15.3 శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ, అధిష్ఠాయ మనశ్చాయం విషయా నుపసేవతే. -- గీత. 15.9 అనునట్లు నీవు నేను పోవు స్థలము లన్నింటికిని వచ్చు బంధువుగ నున్నావు. (అనగా నే నే జన్మ మెత్తినను నీవును వచ్చుచుందువు. నిన్ను నమ్మియే 'చింతయామి' అంటిని. నిన్ను భగవంతుని యొద్ద విడిచి పెట్టెదను. నీవచ్చటనే నిల్చి యుండుము). మనస్సు : నీవు చెప్పునట్లు వర్తించుటకు చూచెదను. నీవు విడిచిన చోటు నాకు సుఖముగ నుండెనేని అందే నిలిచెదను. లేని పక్షమున మఱియొక చోటి కేగెదను.