भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 75, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 75

68 ముకుందమాల కులశేఖరులు: మనసా! నాకు నరకము గల్గినగదా నీవును నరకమునకు బోవలయును? నేను పోవుస్థలములందు నీవు సుఖప డుదువు. నన్ను నమ్మియుండు "వీడు చెడును; అతని తోడ నేనును చెడుదునే"యని భయపడకుము. మనస్సు : నన్ను నమ్మియుండు నీవు సుఖపడుదువని నే నెంచలేదు. కుల : కొంచెమైనను జ్ఞానములేని మనసా! ఇతడు చేర్చు స్థలమున చేరిన సుఖపడవచ్చును. ఇతడు చెప్పు నది హితవని తలంపరాదా? అనేక యమయాతనలను దలచి భయపడకుము. బాగుగ యోచింపుము. నేను ని న్నెవని యొద్దకు బొమ్మనుచున్నానో ఆ ప్రభువును గూర్చి యోచించితివేని భయముండదు. మనస్సు : నేను మీయొక్క మనసైయున్నాను. నావలననే ప్రతి కార్యమును జరుగవలసియున్నది. నాయందు మీకు ప్రీతి గలదు. మన యిరువురకు స్థలము కావలసియు న్నది. నాకు ధైర్యము చెప్పుచున్నారు మీరు. నన్ను పంపిన స్థలము మంచిదని మీరు తలచితిరి. అన్నియును సరే. నన్ను నరకమున ద్రోయుటకు వేచియున్నారే. కుల : అట్టివారెవరు? మనస్సు : కామక్రోధాదులు అనేక జన్మార్జితపాపములు అను నా శత్రువులు నరకమున ద్రోయుటకు యత్నింపుదురే. అవి యడ్డిననెట్లు? కుల : మనసా! ఆ ప్రభువు నాశ్రయించినచో పాపములు సమీపమునకు వచ్చునా? భగవచ్చరణారవిందమను పోలీ సుస్టేషను లోనికిపోయి చేరిన పిమ్మట చోరులవలన భయమేల కల్గును? కాననీవు ఈ యల్పశత్రువులను గూర్చి భయపడనవసరము లేదు. నీవు చెప్పునట్టి శక్తి