भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 74, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 74

ముకుందమాల 67 మందమనః=ఓ మూఢమైన మనసా, యామీః=యముని సంబంధ మైన, బహుధా=అనేకవిధములైన, యాతనాః=నరకబాధలను, చిరం=బహు కాలము, విచింత్య=తలంచి, మా భీః=భయపడవద్దు. అమీః=ఈ, పాప రిపవః=పాపములనెడు శత్రువులు, నః=మనకొఱకు, న ప్రభవంతి=సమ ర్థములుకావు. శ్రీధరః=విష్ణువు, నః=మనకు, స్వామినను=శేషిగదా, ఆలస్యం=జాగుచేయుటను, వ్యపనీయ=పోగొట్టి, భక్తిసులభం=భక్తిచేత సులు వుగా పొందదగిన, నారాయణం=విష్ణువును, ధ్యాయస్వ=ధ్యానముచే యుము. లోకస్య=ప్రపంచమందలి జనులయొక్క, వ్యసన=దుఃఖము లయొక్క అపనోదన=పోగొట్టుటను, కరః=చేయునట్టి (సః=నారాయణ మూర్తి), దాసస్య=భక్తునియొక్క (వ్యసనాపనోదకరణే=వ్యసనమును పోగొ ట్టుటయందు) న క్షమః కిం=సమర్థుడు కాడా యేమి? ఓ మందమనమా! యమయాతనలను పలుతెఱగుల భావించి భయ పడకుము. ఈ శత్రువులు మనల నేమియు చేయలేరు. శ్రీధరుడుగదా మనకు స్వామి! భక్తిసులభుడగు శ్రీమన్నారాయణుని ఆలస్యము చేయక ధ్యానింపుము. లోకములవ్యసనములను పోగొట్టువాడు దాసుని వ్యసనమును పోగొట్టలేడా? (కులశేఖరులు భగవంతునితో సంబంధపడుమనియు, అచటజేరిన సౌఖ్యము గల్గుననియు, శత్రువులు వచ్చి బాధింప రనియు మనస్సునకు బోధించగా దానికి కొంతధైర్యము గలిగెను. కాని సంపూర్ణమైన నమ్మిక కలుగలేదు. అందుచేతనే కులశేఖరుల నిట్లడిగినది.) మనస్సు : నేను మిగుల దుష్టుడను. నన్ను నమ్మిన యెడల నీవు కుంభీపాకమున కూలవలసినదే. చెడియున్న నాకు సుఖము లేదు. అంత మాత్రమే గాక భయముగను నున్నది. నన్ను నమ్మిన నీవు నరకమునకు బోవుచుండగా నేనును నీతోడ రావలసినదే గదా!