मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 77, कुल 167 में से
संदर्भ में पढ़ें70 , ముకుందమాల కుల : కాపాడును. అయినను అతని యొద్ద కేగునపుడు ఆలస్య మను దుష్టుని మాత్రము చేర్చుకొని పోకుము. వానిని త్యజింపుము. మనస్సు : కామక్రోధాదులు పాపములు మొదలగువానికి భయపడ వలయును గాని ఆలస్యమునకు భయపడనేల? కుల : ఆలస్యమును విడిచిన యెడల అన్నియును సమకూ రును. ఆలస్యమును త్యజించిన తోడనే విషయములను చక్కగ గ్రహింపవచ్చును. ఆలస్యము వీడెనేని జ్ఞానము కలుగును. దోషము లన్నియు తామే పాఱిపోవును. మనస్సు : ఆలస్యమును నెట్టివేసిన యెడల ఆయన పిలుచునా? కుల : పిలువకేమి? భక్తి సులభుడుగదా! మనస్సు : అత డెచ్చట నున్నాడో! కుల : మనసా! ఇతర ప్రభువులను దర్శింపగోరితిమేని వారుండు చోటికి పోవలసియుండును. ఇతనిని తలచితిమేని మనయొద్దకే యీతడు వచ్చును. అతని దర్శనమునకు పోనక్కరలేదు. ధ్యానింపుము. మనస్సు : మనము పోనియెడల ఆయనయే మన దగ్గరకు రావ లసియుండును. అందుచేత అతనికి మాత్రము శ్రమగలుగదా? కుల : మనసా! ఆయన మన హృదయముననే యున్నాడు. అతడు నారాయణుడు. చరాచర ప్రపంచమునం దుండు వాడు. అన్నిటికిని ఆశ్రయము, ఆధారము. అతడు సర్వాంతర్యామి. గామావిశ్య చ భూతాని ధారయా మ్యహమోజసా, పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః. -- గీత. 15.13