मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 79, कुल 167 में से
संदर्भ में पढ़ें72 ముకుందమాల సంసార సముద్రమును పొందినవారును, ద్వంద్వము లనెడి గాలిచే కొట్టబడినవారును, పుత్రకళత్రాదుల రక్షణభారముచేత పీడింపబడిన వారును, విషమంబులగు విషయము లనెడు నుదకమునందు మునిగిన వారును, తెప్పలేనివారును అగు నరులకు విష్ణువనెడి యోడ ఒకటే శరణ మగును. 10, 11శ్లోకములలో భగవంతునిలో జేరుమని కులశేఖరులు మనసు నకు బోధించగా అదియిట్లు పలికెను. మనసు : భగవంతుని యందు లయించు పక్షమున సుఖపడవ చ్చును. సంసారసాగరమునబడి యుల్లాడుచుండు మీరు దీని నెట్లు దాటగలుగుదురు? కుల : మనసా! నీవు చెప్పినరీతిగా నేను సంసార సాగరమున దిగితిని. మరల గట్టెక్కుద మని చూడగా, శీతోష్ణము లను గాలి కొట్ట నారంభించెను. వివాహసమయమున మేళతాళములు, విందు భోజనములు, బంధుదర్శనము మొదలగు సంభ్రమములతో గూడి యుండినందున కష్టములు తెలియకుండెను. భార్య కాపురమునకు వచ్చి సంతానము కలుగగనే సుఖదుఃఖాది ద్వంద్వము లయొక్క గాలికొట్ట నారంభించి గట్టు నెక్కుటకు శ్రమ మాయెను. అప్పటికిని సహించి గట్టెక్కుటకు ప్రయ త్నించితిని గాని భార్యాపుత్రాదులను కాపాడుట యను భారమును తలయందుంచు కొనియుండుట చేతశ్రమతో నడువవలసివచ్చెను. ఆ భారమును పట్టుకొనియే యెక్కవలసియున్నది. ఆ భారముంచుకొని నిలుచు టకు వీలుపడనేరదు. మునిగిన మాత్ర మేమి? గ్రహణ కాలమందు సముద్రస్నానము చేయలేదా యనిన నే నట్టి స్థలమున మునుగలేదు. తగు స్థలమున మునిగిన యెడల భయములేదు. పూడిపోవు స్థలమున దిగితిని. విష