भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 91, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 91

చెడిపోవును. అయోగ్య సహవాసము వలన యోగ్యుడు చెడు నుగాను మంచివాని సహవాసమున దుష్టుడు సన్మార్గవర్తను డగుట కష్టము. పతివ్రతయగు స్త్రీ వ్యభిచారిణి తోడ జేరిన నెట్లో అట్లుచెడును. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రముయొక్క స్పర్శచేత తన పుత్రులమనసు యుద్ధమునుండి మరలెనా యని ధృతరాష్ట్రు డడుగగా నీపుత్రులస్పర్శచేత ఆ మహా క్షేత్రము పాడుకావలసినదేకాని వారి మనసు మరల దని సంజయు డనెను. ఒక దుష్టుని ఎన్ని సాధనములచేతనో త్రిప్పవలసియుండును గాని యోగ్యుని రెండు నిమిషములలో చెఱుపవచ్చును. నీటబడుట సులభము; గట్టెక్కుట కష్టము. మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ, వివిక్తదేశసేవిత్వ మరతి ర్జనసంసది. -- గీత. 13.11 భగవన్మార్గమునకు విరోధులైనవారిని విడువవలయు ననియు, అది యొక గొప్పసాధన మనియు చెప్పబడెను. మంచివస్తువైనను దుర్గంధ పదార్థముతోడ చేరెనేని తోడనే దుర్వాసన గలదియగును. దుష్టసహవాస మట్టిది. అట్లగుటచేత స్వామీ! నీ పాదములందు భక్తిలేని పాపులను క్షణమైనను చూడకుందును గాక. దుష్టుడు చెలికాడైనను, చుట్టమయి నను, సుతుడయినను, మఱెట్టివాడయినను వానిని త్యజించవలయును. తాను చెప్పు హితమును విననందున విభీషణుడు రావణుని విడిచిపెట్టెను. దుష్టులగువారికి సామదానభేదదండోపాయములచేత చెప్పిచూడవలయును. వినకున్న విడువవలయును. ఆత్మబంధువులతో చేరవలయును, గాని శరీ రబంధువులను అంతగ గమనింపరాదు. ఆత్మోజ్జీవనమునకు తగువారితో

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या) · पृष्ठ 91, कुल 167 में से · BharatKosha