भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 90, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 90

ముకుందమాల 83 మాధవ = ఓ లక్ష్మీపతి, క్షీణపుణ్యాన్ = పాపముచేసినవారిని, క్షణ మపి = ఇంచుక సేపైనను, భవతః = నీయొక్క, పద + అబ్జే = కమలముల వంటి పాదముల యందు, భక్తిహీనాన్ = భక్తి లేనివారిని, మాద్రాక్షం = చూడకుం దును గాక, శ్రావ్యబంధం = వినదగిన రచనగల, తవ = నీయొక్క, చరితం = కథను; అపాస్య = విడిచి, అన్యత్ = ఇతరమయిన, ఆఖ్యానజాతం = చరిత్రముల సమూ హమును, మాశ్రౌషమ్ = వినకుందునుగాక, భువనపతే = లోకనాయకుడవగు శ్రీకృష్ణమూర్తీ, త్వాం = నిన్ను, చేతసాఽపి = మనస్సుతోనయినను, అపహ్నువా నాన్ = తిరస్కరించువారిని, మాస్మార్షం = తలంచకుందునుగాక, జన్మజన్మాం తరేఽపి = ప్రతిజన్మములోను, త్వత్ = నీయొక్క, సపర్యా = సేవయొక్క, వ్యతి కరరహితః = సంబంధము లేనివాడుగా, మా భూవం = కాకుందునుగాక! ఓ లోకనాథా! నీయొక్క పాదకమలములయందు క్షణకాలమైనను భక్తిలేని పాపులను నేను చూడజాలను. చెవి కింపైన మీయొక్క చరిత్ర మును విడిచి యితరమయిన ప్రబంధములను చెవులార వినను. ఓ శ్రియఃపతీ! నిన్ను తిరస్కరించువారిని మనస్సుచేత నయిన తలం చను. జన్మజన్మాంతరములయందును నీ కైంకర్యము కల్గియుందును గాక! మనస్సు : బుద్ధీంద్రియాదులను వశపఱచుకొనవచ్చును కాని అయో గ్యులు చేరినయెడల అన్ని ప్రయత్నములును వ్యర్థము లగును. దీనికి మార్గ మేదో తెలియుకున్నది. కుల : మనసా! దుర్మార్గుల సహవాసము కలుగకుండుటకై స్వామిని ప్రార్థించెదను. (కులశేఖరులు మనసునకు ఈ రీతిగ తెల్పి భగవంతుని ప్రార్థించిరి). కుల : స్వామీ! అనేక ప్రయత్నములు చేసి మంచిస్థితికి వచ్చి యుండువాడైనను దుర్మార్గుని వలలో పడినప్పుడు హీనస్థితికి వచ్చును. అట్టివాని సహవాసమున నెట్టి భక్తికలవాడైనను