भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 98, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 98

ముకుందమాల 91 ఓ నాలుకా! కేశవుని పాడుము. ఓ మనసా! మురవైరిని భజింపుము. చేతులారా! శ్రీధరుని చక్కగా నారాధింపుడు. చెవులారా! అచ్యుతుని కథల నాలకింపుడు. కన్నులారా! శ్రీకృష్ణుని చూడుడు. పాదములారా! శ్రీహరి సన్నిధికి పొండు, ఘ్రాణమా! ముకుందుని పాదములందు సమర్పించిన తులసిని వాసన చూడుము. శిరమా! అధోక్షజుని నమస్కరింపుము. స్వామి : పాపులను చూడగూడదనియు, భగవత్సంబంధము లేని కథలను వినగూడదనియు, భగవంతుని ద్వేషించువానిని స్మరింపరాదనియు, ప్రతిజన్మమునందును నా కైంకర్య ములేక ఉండరాదనియు కోరితివి. ఇంకను ఏమి కావలయును? కులశేఖరులు: స్వామీ! సర్వేంద్రియములచేతను, మనోబుద్ధులచేతను సుఖము కలుగవలయును. స్వామి : అటులైన నింద్రియములను ప్రార్థించుకొమ్ము (కులశేఖ రులు మనసు చంచలమైనదని తలచి, భగవంతునియందు లయింపుమని ముందు ప్రార్థించియుండిరి. మనసు నట్లు ప్రార్థించుటచేత తదితరములైన ఇంద్రియములకు కోపము రాగా -- యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. -- గీత. 2.60 అను రీతి ప్రమాదములైన ఇంద్రియములు మనసు నీడ్చునని తలం చిరి. దుష్టుడగు పుత్తునికి సద్బోధచేసి మంచిమార్గమున త్రిప్పదలచువారు వాని మిత్రులను గూడ వానిచెంత చేరనీయకుండ చేయవలయును. కేవ లము తండ్రిశుశ్రూష తప్ప నితరము నెఱుంగని ఋశ్యశృంగుని వేశ్యాంగనలు తమ యూరికి పిలుచుకొని పోలేదా? కులశేఖరు లీ కారణములను దలచి భగవదాజ్ఞగైకొని యింద్రియముల నీ రీతి ప్రార్థించిరి.)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या) · पृष्ठ 98, कुल 167 में से · BharatKosha