मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 99, कुल 167 में से
संदर्भ में पढ़ें92 ముకుందమాల కులశేఖరుడు : నాలుకా! మనసు భగవంతునియందు లయించిన నేమి? భగవన్నామమును కీర్తింపగలుగునా? నీవే ఆ పని చేయవలసిన దానవు. కాన కేశవుని కీర్తించుము. మనసా! ఇతరేంద్రియములను ప్రార్థించినంత మాత్రాన నిన్ను మరచితి ననుకొనకుము. నీవు మురవైరిని దలంపుము. చేతులారా! కేవలము భగవత్కీర్తనము చేసినజాలదు. మీరు శ్రీధరుని పూజింపుడు. చెవులారా! భగవంతుని పూజింపవలయునను కోరిక పుట్టవలయును. భగవత్కథ లను వినినపుడే భక్తి గలిగి ఆ కోరిక పుట్టును. మీరు వినినపుడే ఇతరేంద్రియాదులు పనిచేయును. కాన మీరు అచ్యుతుని కథల నాలింపుడు. కన్నులారా! ఎన్ని విధములుగ విన్నను అంతభక్తి గలుగదు. సాక్షాత్తుగ చూచినపుడే భక్తి కుదురును. కాన మీరు కృష్ణుని చూడుడు. పాదములారా! మీరు నడచి వెళ్ళిననే కదా భగవద్దర్శనము చేసికొననగును. మీరే ముఖ్యమైనవారు గాన శ్రీహరిసన్నిధికి పొండు. ఓ నాసికా! ఇంతదూరము పోయి హరిసన్నిధిని ప్రవేశించినపుడు భక్తులతో నిండి యుండు ఆ ప్రదేశమున చెమటపట్టును. ఇక చాలును, వెలుపలికి పోవలయునని తోచును. నీవు ఇతర వాసనలను కోరకుము. ఆ సన్నిధియందు ముకుంద చరణారవిందములందు సమర్పించిన తులసి యుండును. దానిని వాసన చూడుము. ఓ శిరమా! భగవంతుని సన్నిధికి పోయినప్పుడు నీవు వంగక గర్వ ముతో నుంటివేని యనర్థముసంభవించును. కావున సన్నిధిలోపలికి పోవునపుడే నమ్రతతో పొమ్ము. మనోవా క్కాయములకు అందనివాడు, ఇంద్రియములచేత గలుగు జ్ఞానమునకు గోచరించనివాడైన అధోక్షజునికి నమస్క రింపుము. (కులశేఖరులు ఆ యా యింద్రియములను