भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 100, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 100

ముకుందమాల 93 పిలిచి భగవద్విషయమున సంబంధపడుడని చెప్పునపుడు రెండు చేతులారా! రెండు చెవులారా! అని యీ రీతి రెంటితోడను చెప్పనేల అనగా రెండును కలసి కైంకర్యము చేయ వలయుననెడు తాత్పర్యముచేత. రెండుచేతులతో పూజింపవలయును. రెండు చెవులతో వినవలయును. ఒక చెవితో భగవత్కథ వినుచు మఱి యొక చెవితో నింకొక పుక్కిటి పురాణమును వినరాదు. భగవంతుని రెండు కన్నులతో సేవింపవలయును. ఒక కంట సేవింపుచు మఱియొక కంట నింకొక పదార్థ మును జూడరాదు. ఈ కారణములచేతనే రెంటిని గూర్చి చెప్పబడెను). ఒక్కొక్క యింద్రియమును భగ వద్విషయమున నొక్కొక కార్యము ఏల చేయవలయు ననగా ఆ యా కార్యములు చేసిననే ఆ యా యింద్రి యముల కా యాపేరులు కలుగును. భాగవతమున నీ సంగతి క్రింది విధమున జెప్పబడినది. స్థావరజంగ మములందు నిండిన స్వామిని తలచు మనసే మనసు. భగవంతుని భాగవతులను సేవించునదే శిరము. స్వామి దివ్యమంగళ విగ్రహమును సేవించునవే కన్నులు. ఆంధ్రభాగవతమున ప్రహ్లాదు డిట్లు చెప్పెను. సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి