चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 112, कुल 674 में से
संदर्भ में पढ़ें92 చక్రదత్త—౫. అర్శోధికారము.
దంత్యారిష్టము.
శ్లో. దంతీచిత్రకమూలానాం ఉభయోః పంచమూలయోః,
భాగా న్పలాశా నాపోథ్య జలద్రోణే విపాచయేత్. 23.
త్రిఫలం త్రిఫలాయా శ్చ దలానాం తత్ర దాపయేత్,
రసే చతుర్థశేషే తు పూతశీతే ప్రదాపయేత్. 24.
తులాం గుడస్య తత్క్షిప్త్వా నాసార్థం ఘృతభాజనే,
తన్మాత్రయా పిబే న్నిత్య మర్శోభ్యో విప్రముచ్యతే. 25
గ్రహణీపాండురోగఘ్నం వాతవర్చోఽనులోమనమ్,
దీపనం చారుచిఘ్నం చ దంత్యారిష్ట మిదం విదుః.
పాత్రేఽరిష్టాదిసంధానం ధాతకీలోధ్ర లేపితే. 26.
తెల్లదింటెన నల్లదింటెన చిత్రమూలము దశమూలములు త్రిఫలములు వీటి నొక్కొక్క పలము చొప్పున తీసికొని నలియగొట్టి ద్రోణపునీటిలొ పక్వముచేయవలయును. అందు త్రిఫలముల బెరడును 3 పలములును జాపత్రి 3 పలములు బెల్లము తులాప్రమాణమును ఆరెపువ్వులు వీటినన్నిటి నందుచేర్చి కలిపి నేతికండలొవైచి పదునైదురోజు లుంచవలయును. తరువాత మాత్రల ననుసరించి ప్రతిదినమును సేవించుచున్నచో మూలరోగములు గ్రహణీరోగములు పాండురోగములు వీటిని నశింపఁజేయును. గుదస్థానమునందలి వాయువును మలమును అనుకూలముగా వెడలించుచుండును. ఇద్దానివలన జఠరాగ్ని దీపించును. అరుచి నశించును. దీనిని దంత్యారిష్ట మని యందురు.
ప్రాణదగుటిక.
శ్లో. సనాగరా రుష్కరవృద్ధదారుకం, గుడేన యో మోదకమత్యుదారకం.
అశేషదుర్నామకరోగదారకం, కరోతి వృద్ధం సహసైవ దారకం. 27.
చూర్ణే చూర్ణసమో జ్ఞేయః మోదకే ద్విగుణో గుడః,
త్రిపలం శృంగబేరస్య చతుర్థం మరీచస్య చ. 28.
పిప్పల్యాః కుడపార్థం చ చవ్యాయాః పల మేవ చ. 29.
తాలీసపత్రస్య పలం పలార్థం కేసరస్య చ,
ద్వే పలే పిప్పలీమూలా దర్ధకర్షం చ పత్రకాత్. 30.
సూక్ష్మైలాకర్ష మేకం తు కర్షం చ త్వగ్దశాంశయోః,
గుడా త్పలాని తు త్రింశ చ్చూర్ణ మేకత్ర కారయేత్. 31.
అక్షప్రమాణా గుటికా ప్రాణదేతి చ సా స్మృతా,
పూర్వం భక్ష్యా తు పశ్చాత్తు భోజనస్య యథాబలం. 32.
మద్యం మాంసరసం యూషం క్షీరం తోయం పిబే త్తథా,
హన్యా దర్మాణి సర్వాణి సహజా-