चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 113, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 93
న్యస్రజాని చ. 34. వాతపిత్తకఫోత్థాని సన్నిపాతోద్భవాని చ, పానా- త్యయే మూత్రకృచ్ఛ్రే వాతరోగగళగ్రహే. 35. విషమజ్వరే చ మం- దేఽగ్నౌ పాండురోగే తథైవ చ, క్రిమిహృద్రోగిణాం చైవ గుల్మశూలా- ర్తినాం తథా. 36. శ్వాసకాసపరీతానా మేషా స్యా దమృతోపమా, శుంఠ్యా స్థానే౬ భయా దేయా విడ్విగ్రహే పిత్తపాయుజే. 37. ప్రాణా దేయం సితాం దత్వా చూర్ణమానా చ్చతుర్గుణామ్, ఆమ్లపిత్తాగ్ని- మాంద్యాదౌ ప్రయోజ్యా గుదజాతురే. 38. అనుపానం ప్రయో- క్తవ్యం వ్యాధౌ శ్లేష్మభవే పలమ్, పలద్వయం త్వనిలజే పిత్తజే తు పలత్రయం. 39.
శొంతి, నల్లజీడివిత్తులు, పెద్దమానుచెక్క, బెల్లము వీటిని మోదకములును చేసి తినినచో నన్నివిధములగు మూలరోగములును, మలమును నశించును. చూర్ణముతో సమానముగా బెల్లమును వాడవలయును. అల్లము 3 పలములు, మిరియములు ఒకపలము, పిప్పళ్లు 2 పలములు, చవ్యము 1 పలము, తాడిశపత్రి ఒకపలము, నాగ కేసరములు అరపలము, మోడి 2 పలములు, జాజిపత్రి 6 మాషములు, చిన్నయేలకులు శావుపలము, లవంగపుపట్ట వట్టివేళ్లు ఒక్కొక్క అక్షకరమును బెల్లము 30 పలములు వీటి నన్నిటిని చూర్ణముచేసి కలిపి ఒక్కొక్కతులమంత మాత్రలను కట్టవలయును. ఇయ్యది ప్రాణదగుటిక యనబడును. భుజించుటకు ముందుగా ఈమాత్రను సేవించి భోజనానంతరమున బలానుసారముగా మద్యము మాంసరసమును యూషమును పాలు నీరు వీటిని త్రాగవలయును. ఇదియన్ని తెగలగు మూలరోగములను శరీరముతో కూడఁ బుట్టిన మూలరోగమును, వాతపిత్తకఫముల నగు మూలరోగములను నశింపఁజేయును.
అతిపానము మూత్రకృచ్ఛ్రము వాతరోగము గళగ్రహము, విషమజ్వరము అగ్నిమాంద్యము పాండురోగము వీటిలో నిది హితకరము. జంతువాతము హృద్రోగము గుల్మరోగము శూలరోగము శ్వాసరోగము దగ్గు వీటితోకూడిన రోగికి ఈమాత్రలు అమృతతుల్యములు. పిత్తమువలన మూలరోగముకలిగెనేని శొంతి అల్లము వీటికిబదులు గాకరక్కాయను వేయవలయును, చూర్ణముకంటే నాలుగురెట్లు చక్కెరను కలిపి దీనిని తయారుచేయవలయును. ఆమ్లపిత్తము మందాగ్ని మున్నగువానియందును, గుదరోగములయందు సీమాత్రల నుపయోగింపవలయును. కఫరోగమునం దొకపలము అనుపానమును చేర్చవలయును. వాతరోగమునందు 2 పలముల అనుపానమును పిత్తరోగమునందు 3 పలముల అనుపానమును ఈయవలయును.