चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 114, कुल 674 में से
संदर्भ में पढ़ें94 చక్రదత్త—౫. అర్శోధికారము.
కాంకాయనమోదకములు.
శ్లో. పథ్యాపంచపలా స్వేక మజాజ్యా మరీచస్య చ, పిప్పలీ
పిప్పలీమూల చవ్య చిత్రక నాగరాః. 40. పలాభివృద్ధ్యాః క్రమశః
యవక్షారం పలద్వయమ్, భల్లాతకపలా న్యష్టౌ కందస్తు ద్విగుణో
మతః. 41. ద్విగుణేన గుడేనైషాం వటకా నక్షసమ్మితాన్, కృత్వైకనం
భక్షయే త్ప్రాతః తక్రమంభోను వా పిబేత్. 42. మందాగ్నిం దీపయ
త్యేష గ్రహణీపాండురోగవిత్, కాంకాయనేన శిష్యేభ్యః శస్త్రక్షారా
గ్నిభి ర్వినా. 43. భిషగ్జిత మితి ప్రోక్తం శ్రేష్ఠ మర్శోవికారిణామ్.
కరక్కాయలు ఐదుపలములు, జీలకఱ్ఱ, మిరియములు ఒకపలము, పిప్పళ్లు ఒకపలము, మోడి మూడుపలములు, చవ్యము నాలుగుపలములు, చిత్రమూలము ఐదుపలములు శొంఠి ఆరుపలములు, యవక్షారము రెండుపలములు, నల్లజీడివిత్తులు ఎనిమిదిపలములు, కందదుంప పదహారుపలములు వీటి యన్నింటికి రెండుగెట్లు బెల్లము కలిపి పావుపావుపలము చొప్పున మాత్రలను కట్టవలయును. ప్రాతఃకాలమున ఒకమాత్రను తిని పైన మజ్జిగను కాని నీళ్లనుకాని త్రాగవలయును. ఇది అగ్నిమాంద్యమును పోగొట్టును. గ్రహణులను, పాండురోగమును నశింపచేయును. ఇది శస్త్రములు, క్షారపదార్థములు అగ్నితాపనములు మొదలగునవి లేకయే జయించు నని కాంకాయనమునిచేత శిష్యులకు చెప్పబడినది. మూలరోగముల కన్నిటికిని శ్రేష్ఠమైన ఔషధము.
మాణిభద్రమోదకము.
శ్లో. విడంగసారామలకాభయానాం పలం పలం స్యాత్త్రివృత
స్త్రయంచ. 44. గుడస్య షట్ ద్వాదశభాగయుక్తా మాసేన త్రింశ
ద్గుటికా విధేయాః. నివారణే యక్షవరేణ సృష్టః, స మాణిభద్రః కిల
శాక్యభిక్షువే. 45. అయం హి కాసక్షయ కుష్ఠనాశనం భగందరప్లీహ
జలోదరార్శసామ్, యథేష్టచేష్టాన్నవిహారసేవీ అనేన వృద్ధ స్తరు
ణో భవే చ్చ. 46.
వాయువిడంగములు, దానిమ్మ బెరడు, ఉసిరిక కాయలు, కరక్కాయలు వీటి నొక్కొక్కపలమును, తెల్లతెగడ మూడుపలములు, బెల్లము ఆరుపలములు చొ॥ పన్నెండుభాగములను తీసుకొని ముప్పదియుండలను కట్టవలయును. ఈయుండలను మాణిభద్రుడను యక్షుడు సృజించెను. వీనివలన దగ్గులు, క్షయరోగములు, కుష్ఠులు భగం