चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 131, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 111
- ఏత దగ్నిముఖం నామ దుర్నామాంతకరం పరం, సమమగ్నిం కరో త్యాశు కాలాగ్నిసమతేజసం. 166. పర్వతా అపి జీర్యంతి ప్రాశనా దస్య దేహినః, గురువృష్యాన్న పానాని పయోమాం సరసో హితః. 167. దుర్నామపాండుశ్వయథు కుష్ఠప్లీహోదరాపహం, అకాలపలితం చైత దామవాత గుదామయం. 168. న స రోగో ఽస్తియం చాపి న నిహన్యా దిదం క్షణాత్, కరీరకాంజికాదీని కకారాదీని వర్జయేత్. 169. స్రవ త్యతో న్యథాలోహం దేహా త్కిట్టం చ దుర్భరం.
తెల్లతెగడ చిత్రమూలము వావిలి జెముడు జటామాంసి ఎన్నిదెన్ని దిపలములుచొ॥ ఒకద్రోణము నీటిలో పక్వముచేయవలయును.
వాయువిడంగములు 3 పలములు శొంఠి మూఁడుకర్షములు నల్లే మిరియములు పిప్పళ్లు త్రిఫలములు అర్ధపలము శిలాజిత్తు ౧ పలము వీటినికలిపి దివ్యౌషధులచేత హతముచేసిన రుక్మ లోహచూర్ణమును 16 పలములును పై నీటిలొ కలపవలయును. గట్టిపడిన పిమ్మట దింపి చల్లార్చి 24 పలముల తేనెను చక్కెరను కలిపి సేవింపవలయును.
ఇయ్యది అగ్నిముఖమను చూర్ణము. ఇది మూలరోగములనుపోగొట్టును. అగ్నినుద్దీపింపచేయును. ఈచూర్ణమును సేవించినవారు రాళ్ళను భుజించినను జీర్ణముకాగలశక్తినొందెదరు. బలకరములైన వృష్యములును అన్నపానములును పాలుమాంసము మున్నగునవి ఇందుహితములు. ఇయ్యది మూలరోగము పాండురోగము ప్లీహ కుష్ఠు అర్శ ఉదరరోగములు అసమయములలో తల నెఱియుట, ఆమవాతము గుదామయము మున్నగు వానిని కూడ పోగొట్టును.
ఇంతయేల? దీనఁగుదుఱని రోగమేలేదు. ఈయౌషధమును సేవించుకాలమునందు శరీరము కాంజికము మున్నగు క కారము మొదలుగాగల పదార్థములను త్యజింపవలయును. అట్లు త్యజింపనిచో దేహమునుండి లోహముయొక్క మైల స్రవింప నారంభించును. ఇయ్యది అత్యంతము దుర్భరమైనది.
❧ భల్లాతక లేహము. ❧
శ్లో. చిత్రకం త్రిఫలా ముస్తం గ్రంధికం చవికా మృతా, హస్తిపిప్పల్యపామార్గ గుడోత్పలకుశేరకాః. 170. ఏతాన్ చతుష్పలాన్ భాగాన్ జలద్రోణే విపాచయేత్, భల్లాతకసహస్రే ద్వే ఛిత్త్వా తత్రైవ దాపయేత్. 171. తేన పాదావశేషేణ లోహపాత్రే పచే ద్భిషక్, తులార్ధం తీక్ష్ణలోహస్య ఘృతస్య కుడపద్వయం. 172. తూర్ణీశణం