भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 147, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 147

ఆంధ్ర తాత్పర్యసహితము. 127

చెమ్మటఁ బుట్టించుట, గుదస్థానమున గుడ్డల నుంచుట, లంఘనము చేయించుట, ననునివి క్రమముగా జఠరాగ్నిని వృద్ధిఁ జేయును. నొప్పి కలిగియుండినచో పొట్టకు దేవదారు చెక్క, వస చెంగల్వకోష్టు సదాప ఇంగువ సైంధవలవణము వీటిని కాంజికముతో నూరి పట్టు వేయవలయును. యవలను పొడిచేసి ఆచూర్ణమును వెచ్చజేసి దానిలో యవక్షారము మజ్జిగ కలిపి త్రాగినయెడలఁ కడుపులోని శూల తొలఁగి చనును. అజీర్ణరోగి ఎక్కువకడుపునొప్పిచేత బాధపడుచున్నను శూలనణగించు నౌషధములను త్రాగకూడదు. ఏలయనఁగా దోషములచేత గప్పివేయఁబడిన జఠరాగ్ని దోషములరాశిని పచనముచేయుటకు గాని నశింపఁజేయుటకు గాని సమర్థము కాదు.

ఇట్లు చక్రదత్తయందు అగ్నిమాంద్యాధికారప్రకరణము ముగిసెను.

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 147, कुल 674 में से · BharatKosha