भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 154, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 154

134 చక్రదత్త—౮. పాండురోగాధికారము.

తం లిహ్యత్కామలాపాండురోగవాన్. 29. తుల్యా అయోరజః పథ్యా హరిద్రా క్షౌద్రసర్పిషా, చూర్ణితాః కామలీ లిహ్యా ద్గుడక్షౌద్రేణ వా౭ భయాం. 30. ధాత్రీలోహరజో వ్యూష నిశాక్షౌద్రాజ్యశర్కరాః, లీఢ్వా నివారయత్యాశు కామలా ముద్ధతా మపి. 31. దగ్ధ్వాఽక్షకాష్ఠై రలమాయసం తు గోమూత్ర నిర్వాపిత మష్టవారాన్, విచూర్ణ్య లీఢం మధునా చిరేణ కుంభాహ్వయం పాండుగదం నిహంతి. 32. పాండురోగక్రియాం సర్వాం యోజయే చ్చ హలీమకే, కామలాయాం చ యా దృష్టా సాఽపి కార్యా భిషగ్వరైః. 33.

త్రిఫలముల రసముగాని తిప్పతీగెరసముగాని వేపచెక్కగాని తెచ్చి దాని యందు తేనెను కలిపికొని ప్రాతఃకాలమున తాగినచో కామెరలు నశించును. కామెరలు గలవారికి తుమ్మిరసము నంజనముచేసి గాని, పసపు గైరికము ఉసిరిక వీటిని చూర్ణముచేసి గాని ఇయ్యవలయును. ఆకారకరచెట్టుపై బెరడును నస్యము చేసి యుపయోగింపవలయును. లేక ఆవఆకులను వాసననైనను చూడవలయును. చక్కరతో కలిపిన తెల్లతెగడయనెను కొడిసెపాలవిత్తులఁ బెల్లము చేర్చిన శొంఠియైనను హిత మొనర్చును. మ్రానిపసపు త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు లోహపు భస్మము వీటిని నూరి తేనెనేతులలో చేర్చుకొని కామెరలు పాండురోగము గల రోగిత్రాగవలయును. లోహభస్మము కరకకాయ మ్రానిపసపు వీటిని సమానభాగములను తేనెనేతులలో కలిపి గాని, కరకకాయను బెల్లము తేనెతో కలిపిగాని, కామెరలు గలవాఁడు భక్షింపవలయును. ఉసిరిక ఇనుపచిట్టము శొంఠి మిరియములు పిప్పళ్లు పసపు తేనె నెయ్యి చక్కర వీటిని కలిపికొని తినినయెడల నతిభయంకరము లగు కామెరలు కూడను తొలఁగిపోవును. పాతఇనుపచిట్టెమును తాండ్రనిప్పులతో తగులఁబెట్టి గోమూత్రములో నెన్మిదిమారులు ముంచి పిమ్మట చూర్ణము జేసి తేనెలోఁ గలిపి కొని తినినట్లైన కుంభకామెరలు పాండు రోగములును నశించును. పాండురోగములో చెప్పఁబడిన చికిత్సలను హలీమకరోగవిషయమునఁగూడ నొనర్పవలయును. కామెరలకు చెప్పిన చికిత్సనే వైద్యుఁడు హలీమకమందు గూడ నుపయోగింపవలయును.

❧ విడంగాద్యలోహము. ❧

శ్లో. విడంగ ముస్త త్రిఫలా దేవదారు షడూషణైః, తుల్య మాత్ర మయశ్చూర్ణం గోమూత్రేఽష్టగుణే పచేత్. 34. తై రక్షమా