चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 161, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 141
ములయొక్క భోజనము, రక్తపిత్తరోగులకు హితకర మగును. రక్తపిత్తరోగము గలవారలకు చిరుసెనగలు పెసలు సెనగలు కందులు అడవిపెసలు మొదలగునవి పప్పుకొఱకును గంజికెని శ్రేష్ఠము లని చెప్పఁబడినవి. పొట్లకాయ ప్రేంఖణము చిట్టికూర మొదలగుకూరలు హితకరములు. లావపిట్టలు పావురములు మున్నగువాటి యొక్కయును కుందేలు జింక లేడి మున్నగువానియొక్కయును మాంసము హితకరము. శొంతి లేకుండునట్లు షడంగకషాయమును బెట్టి దీనిని మాంసముక్షీణించినవానికిని బలము గల పిల్లవానికిని వృద్ధులకును శోషిల్లువారికి (రోగులకు) ఇయ్యవలయును. వాంతి చేయింపఁ దగనివానిని విరేచనముల కీయకూడనివానిని స్తంభనములచేత చికిత్స చేయవలయును. ఋషభక మను గ్రంధద్రవ్యముయొక్క ఆకులను పిండి తేనెను చక్కెరను ఆరసములోఁ గలిపి త్రాగినయెడల నతిభయంకరమైన రక్తపిత్తము కూడ శాంతించును. అడ్డసరపుకషాయమునందు కొట్టధాన్యములోని మట్టిని తైలమును గాని, లొద్దుగరసమునందు తేనెను కలిపికొనిగాని త్రాగినచో రక్తపిత్తములు హరించును. అడ్డసరపుకషాయమునందు తాలిసపత్రి చూర్ణమును కలిపి త్రాగినయెడల కఫరక్తపిత్తములు స్వరభేదము రక్తపిత్తము హరించును. అడ్డసరపాకు, ద్రాక్ష, కరక్కాయల కషాయములో కండచక్కెరను తేనెను కలిపికొని త్రాగినయెడల దగ్గు శ్వాస రక్తపిత్తము తొలఁగి చనును. అడ్డసరపుటాకుండఁగా జీవించెదనని ప్రాణములపై నాశయుండఁగా రక్తపిత్తరోగీయును కాసరోగీయును ఎందుకొఱకు దుఃఖితుఁడై యుండవలయును. బ్రహ్మమేడియాకుల రసమునందు తేనెను కలిపి త్రాగిన రక్తపిత్తములు నశించును. మల్లెవేరుతో చేసిన కషాయమునం దేనెను కండచక్కెరను కలిపికొని త్రాగినచో రక్తపిత్తరోగీయు కాసరోగీయు క్షయరోగీయును సుఖము నొందును. అవిసెపూవులు ముత్తవపులగము మట్టియూడల బెరడు వీటిని సమభాగములుగా నూరి త్రాగి పెసరగంజిని పుచ్చుకొనినేని రక్తపిత్తము శమించిపోవును.
రక్తపిత్తములు శమించు క్షీరాదులు.
శ్లో. కషాయయోగైర్వివిధైః దీప్తాగ్నౌ నిర్జితే కఫే, రక్తపిత్తం న చేచ్ఛామ్యేత్ తత్ర వాతోల్బణే పయః. 20.
ఛాగం పయోఽథవా గవ్యం శృతం పంచగుణే జలే, అభ్యసేత్తృషితాక్షౌద్రం పంచమూలీశృతం పయః. 21.
ద్రాక్షయా పర్ణిసీభిర్వా కలయా మధుకేన వా, శ్వదంష్ట్రయా శతావర్యా రక్తజిత్సాధితం పయః. 22.
పక్వోదుంబరకాశ్యర్యపథ్యాఖర్జూరగోస్తనాః, మధునా ఘ్నంతి సంలీఢా రక్తపిత్తం పృథక్పృథక్. 23.