चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 163, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 143
కాసం శ్వాసం జ్వరం హిక్కాం ఛర్దిం మూర్ఛాం మదం భ్రమమ్. 30.
రక్తనిష్ఠీవనం తృష్ణాంపార్శ్వశూల మరోచకం, శోధఫ్లీహధ్వవాతాంశ్చ
స్వరభేదం క్షతక్షయం. 31. గుటికాం తర్పణీ వృష్యా రక్తపిత్తం చ నాశ
యేత్.
ఏలకులు జాపత్రి లవంగపట్ట వీనిని అర్ధకర్షమున్ను పిప్పళ్లు అరపలము, కలకండ యష్టిమధుకము ఖర్జూరము ద్రాక్ష ఇవి ఒక్కొక్క పలము తెచ్చి అన్నింటిని కలిపి చూర్ణముచేసి తేనెను కలిపి వైద్యుఁడు మాత్రలు కట్టవలయును. కర్షమంతేసి ప్రమాణముగల ఆమాత్రలను ప్రతిదినమును భక్షింపవలయును. ఇయ్యది దగ్గు శ్వాసము జ్వరము వెక్కిళ్లు దురద మూర్ఛ మత్తు భ్రమ నెత్తురునుమ్ముట దప్పి పార్శ్వపునొప్పి అరోచకము వాపు పొడలరోగము వాతరక్తము స్వరభేదము క్షయ రక్తపిత్తము మున్నగువానిని నశింపచేయును. తృప్తి నొందించును. వీర్యమును వృద్ధి నొందించును.
❧ పృథ్వీకాప్రయోగములు. ❧
శ్లో. లోహగంధిని నిశ్వాసే ఉద్గారే రక్తగంధిని. 32. పృథ్వీకాం
శాణమాత్రాం తు ఖాదే ద్ద్విగుణశర్కరాం, నాసాప్రవృత్తరుధిరంఘృ
తభృష్టం శ్లక్ష్ణపిష్టమామలకమ్, సేతురివ తోయవేగం రుణద్ధి మూర్ధ్ని
ప్రలేపేన. 33. ఘ్రాణప్రవృత్తే జలమేవ దేయం సశర్కరం నాసిక
యా పయోవా, ద్రాక్షారసం క్షీరఘృతం పిబేద్వా సశర్కరం చేక్షు
రసం హితంవా. 35. నస్యం దాడిమపుష్పోత్థో రసో దూర్వాభవో థవా,
ఆమ్రాస్థిజః పలాండోర్వా నాసికాస్రుతరక్తజిత్. 35. మేధ్రగేతి
ప్రవృత్తౌ తు వస్తి రుత్తర సంజ్ఞితః, శృతం క్షీరంపిబే ద్వాపి పంచ
మూల్యా తృణాహ్వయాం. 36.
ఇనుమువంటి వాసనగల నిట్టూర్పు గలిగినప్పుడును, నెత్తురువాసనవంటి వాసనగల తేఁపులు వచ్చినప్పుడును, నాలుగుమాషముల నల్లజీలకఱ్ఱచూర్ణమును రెండురెట్ల శర్కరతో చేర్చికొని తినవలయును. ఉసిరిక కాయలను నూరి నేతితో వేయించి తలపైన పట్టు వేయించినయెడల ముక్కున నెత్తురుగారుటను నీటి ప్రవాహమును ఆనకట్టవలె నిల్పివేయును. ముక్కునుండి రక్తము కారుచుండినప్పుడు కండచక్కెర గలిపిన నీటినిగాని పాలనుగాని ద్రాక్షరసమునుగాని పాలతోచేసిన నేతినిగాని ముక్కుగుండా పీల్చవలయును. లేకపోయినచో చక్కెర గలిసిన చెఱకురసముగాని హితకర మగును. దానిమ్మపూవులరస