चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 165, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 145
పాలు పోసి నేతిని వండవలయును. ఇయ్యది శతావరీఘృత మనఁబడును. ఇది దగ్గును జ్వరమును మలబంధమును శూలలను రక్తపిత్తరోగములను నశింపఁజేయును.
రెండవదియగు శతావరీఘృతము.
శ్లో. శతావర్యా స్తు మూలానాం రసప్రస్థద్వయం మతమ్, తత్సమం చ భవే త్క్షీరం ఘృత ప్రస్థే విపాచయేత్. 42. జీవకర్షభకా మేదా మహామేదా తథైవ చ, కాకోలీ క్షీరకాకోలీ మృద్వీకా మధుకం తథా. 43. ముద్గపర్ణీ మాషపర్ణీ విదారీ రక్తచందనమ్, శర్కరా మధు సంయుక్తం సిద్ధం విస్రావయే ద్భిషక్. 44. రక్తపిత్తవికారేషు వాతరక్తగదేషు చ, క్షీణశుక్రేషు దాతవ్యం వాజీకరణ ముత్తమమ్. 45. అంసదాహం శిరోదాహం జ్వరం పిత్తసముద్భవమ్, యోనిశూలం చ దాహంచ మూత్రకృచ్ఛ్రించ పైత్తికమ్. 46. ఏతా న్గోగా న్హంత్యాశు ఛిన్నాభ్రాణీవ మారుతః, శతావరీసర్పి రిదం బలవర్ణాగ్నివర్ధనమ్. 47. స్నేహపాద స్మృతః కల్కః కల్కవ న్మధుశర్కరే, ఇతివాక్యబలా త్స్నేహప్రతీష్యం పాదికం భవేత్. 48.
పిల్లిపీచరరసము రెండుప్రస్థములను రెండుప్రస్థముల పాలలొకలిపి ఒకప్రస్థము నేతిని వండవలయును. జీవకము ఋషభకమును గంధద్రవ్యమును మేద మహామేదలను చేర్చి కాకోలి క్షీరకాకోలి ద్రాక్ష యష్టిమధుకము పిల్లిపెసగ కారుమినుము నేలగుమ్ముడి రక్తచందనముకండచక్కెరతేనెవీటినికూడ పైదానియందుకలిపి నేతినిపక్వముచేసి దింపవలయును. రక్తపిత్తివికారములయందునువాతరక్తరోగములయందునుక్షీణించిన వీర్యము గలవారిపట్లను ఈనేతిని ఇచ్చినయెడల నత్యుత్తమ మగు వాజీకరణ మగును. భుజముల మంట తలమంట జ్వరము పిత్తజ్వరము యోనిశూల దప్పి మూత్రము కృచ్ఛ్రము నను నీరోగముల నియ్యది గాలి మేఘములఁ బాఱద్రోలినరీతి బాఱద్రోలును. ఇయ్యది శతావరీఘృతము. బలమును కాంతిని ఆకలిని పెంపొందించును. నేతిలొ నాల్గవభాగము కల్కముతో సరిగా తేనెను చక్కెరను చేర్పవలయునను వాక్యముఁబట్టి నేతిలొ నాలగవభాగము కలుపుట మిగుల మంచిది.
వాసాఘృతము.
శ్లో. వాసాం సశాఖాం సపలాశమూలాం కృత్వా కషాయం కుసుమాని చాస్యాః, ప్రదాయ కల్కం విపచే ద్ధృతం త త్సక్షౌద్రమాశ్వేవ నిహంతి రక్తమ్. 49.
19