भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 187, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 187

౧౧. కాసరోగాధికారము.


కాసరోగమునందు సామాన్యోపాయములు.

శ్లో. వాస్తూకో వాయసీశాకం మూలకం సునిషణ్ణకం, స్నేహాస్తైలాదయో భక్ష్యాః క్షీరేక్షురసగౌడికాః. ౧.
దధ్యారనాలామ్లఫలం ప్రసన్నాపాన మేవ చ, శస్యతే వాతకాసేషు స్వాద్వమ్లలవణాని చ. ౨.
గ్రామ్యానూపోదకై శ్శాలియవగోధూమ షష్టికాన్, రసై రాత్మాత్మగుప్తానాం యూషై ర్వా భోజయే ద్ధితాన్. ౩.
పంచమూలీకృతః క్వాథః పిప్పలీచూర్ణసంయుతః, రసాన్న మశ్నతా నిత్యం వాతకాస మపస్యతి. ౪.

చక్రవర్తికూర కామంచికూర ముల్లంగి చెంచలకూర నూనె మొదలగు తైలపదార్థములును, పాలు చెఱకురసము బెల్లపువస్తువులును తినఁదగిన పథ్యపదార్థములు వాతమువలనఁ గలుగు దగ్గుల విషయమై పెరుగు గంజి పులిబచ్చలి మద్యపానము పుల్లనిపదార్థములు మధురపదార్థము ఉప్పువస్తువులు ఉత్తమములగు పథ్యములని చెప్పఁబడినవి. గ్రామములయందలి నీళ్లుతరగని చెరువులుమున్నగు ప్రదేశములలోని యుదకములచేత వరిబియ్యమును యవలను గోధుమలను షష్టిధాన్యములను వండికొని గాని మినుములు దురదగొండి వీనియూషములు గాని పక్వముచేసి భుజింపవలయును. పంచమూలపు కషాయములో పిప్పలి చూర్ణమును వేసికొని త్రాగవలయును. మాంసరసముతో గూడ నన్నమును తినవలయును. ఇట్లు చేసినయెడల వాతమువలన గలిగిన దగ్గు నశించిపోవును.


అపరాజితలేహము.

శ్లో. శృంగీశఠీకణాభార్జీ గుడవాదద యాసకైః, సతైలై ర్వాతకాసఘ్నః లేహోయ మపరాజితః. ౫.

అతివస గంటుకచోరము పిప్పళ్ళు గంటుభారంగి బెల్లము తుంగముస్తెలు తితికనిండతైలము వీటితో లేహమును చేసి సేవించిన వాతరోగములను దగ్గులను పోగొట్టును. ఇయ్యది అపరాజిత మను లేహము.